కెనడాలో ఉన్న 59 ఏళ్ల మహిళను తన మేనల్లుడి వాయిస్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనుకరించి తనకు తక్షణ అవసరం ఉందని చెప్పి రూ.1.4 లక్షల నగదును దోచుకున్నారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మాదిరిగా కాల్ చేస్తారు. అత్యవసరంగా డబ్బు పంపాలని కోరతారు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ శాతం మంది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే ప్రమాదం ఉంది. వ్యక్తిగతంగా వారితో మాట్లాడి వారికి నిజంగా అవసరం ఉంటే అప్పుడే నగదు బదిలీ చేయడం ఉత్తమం. సైబర్ నేరగాళ్లు కొన్నిసార్లు కస్టమర్ కేర్ సభ్యులుగా కాల్ చేస్తారు. బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు టీంకు చెందిన వారిగా మాట్లాడతారు. వ్యక్తిగత సమాచారాన్ని ధృవీకరించమని లేదా చెల్లింపులు చేయాలని కోరతారు. ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ కాల్ చేస్తారు. సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ లేదా ఐఆర్‌ఎస్ వంటి సంస్థల పేరు చెప్పి కాల్ చేయవచ్చు. బెదిరించి లేదా ఇతర విధాలుగా మాట్లాడి నగదు డిమాండ్ చేయవచ్చు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాల్స్ చేసిన వ్యక్తి వివరాలు కచ్చితంగా తెలియకుంటే ఫోన్‌లో వ్యక్తిగత వివరాలు వెల్లడించకూడదు. దాంతోపాటు అత్యవసరంగా డబ్బు లేదా వ్యక్తిగత సమాచారం అడిగే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరాల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయండి. అప్పుడే అలాంటి ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండగలుగుతారు.
ఏఐ ఆధారంగా నకిలీ కాల్ చేసి రూ.1.4 లక్షలు దోపిడీ !
0
November 19, 2023
Tags