Ad Code

డిసెంబరు 14 వరకు ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ కు అవకాశం !


చితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డిసెంబరు 14 వరకు ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించింది. ఈ వ్యవధిలో భారతీయ నివాసితులు తమ జనాభా వివరాల్లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వాటిని ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సవరించడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఆధార్‌లోని అన్ని వివరాలను ఉచితంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. ఫొటోగ్రాఫ్, ఐరిస్ లేదా ఇతర బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాల్సిన వారు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ను వ్యక్తిగతంగా సందర్శించి రూ. 50 రుసుమును చెల్లించాలి. బయోమెట్రిక్ అప్‌డేట్‌లకు వేలిముద్రలు, ఐరిస్ నమూనాలు, ఇతర బయోమెట్రిక్ డేటాను స్కాన్ చేయడానికి ఆధార్ కేంద్రాలలో ప్రత్యేక డివైజ్‌లు అవసరం పడుతుంది. అదనంగా, బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియ సమయంలో మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడానికి అవసరమైన ధృవీకరణ విధానాలను కలిగి ఉంది. ఆధార్ నియంత్రణ సంస్థ అయిన యూఐడీఏఐ ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేసింది. ఇది డేటా కచ్చితమైనదిగా నిర్ధారించడానికి వీలుంటుంది. ఆధార్ మోసాన్ని ఎదుర్కోవడానికి ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. వివాహం తర్వాత తమ పేరు, చిరునామా వంటి ప్రాథమిక జనాభా వివరాలలో మార్పులు అవసరమని యూఐడీఏఐ పేర్కొంది. అదే విధంగా, కొత్త ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు చిరునామా, మొబైల్ నంబర్‌లో మార్పులు అవసరం కావచ్చు. వివాహం లేదా బంధువు ఎవరైనా మరణించినప్పుడు అప్పుడు కూడా అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అదనంగా, నివాసితులు వారి మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్ వంటి సమాచారాన్ని మార్చుకోవచ్చు. రెగ్యులర్ అప్‌డేట్‌లు వివిధ సర్వీసులు, లావాదేవీల కోసం ఆధార్ విశ్వసనీయమైన గుర్తింపుగా పనిచేస్తుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. పిల్లల కోసం బాల ఆధార్ డేటా 15 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలి. అవసరమైన బయోమెట్రిక్ డేటాను కూడా అందించాలి.

Post a Comment

0 Comments

Close Menu