Ad Code

ఐఫోన్‌ 16లో పంచ్‌ హోల్‌ డిస్ ప్లే ?


ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌ బదులుగా పంచ్ హోల్‌ కటౌట్‌ను కలిగి ఉంటుంది. డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌ గత సంవత్సరం విడుదలైన ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. టిప్‌స్టర్‌ మజిన్‌బు నివేదిక ప్రకారం వచ్చే సంవత్సరం అందుబాటులోకి రానున్న ఐఫోన్‌ 16 ప్రో ప్రోటోటైప్‌ వెర్షన్‌లో డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌కు బదులుగా పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 సంవత్సరం మార్చి వరకు ఈ డిజైన్‌పైన నిర్ణయం తీసుకోకపోవచ్చు. అయితే ఐఫోన్ 17లో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే డిజైన్‌ వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం విడుదల అయిన ఐఫోన్‌ 14 ప్రో మరియు ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఆధారిత డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. డైనమిక్‌ ఐలాండ్ ఫేస్ ID సెన్సార్లు, ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరాను దాచిపెడుతుంది. నోటిఫికేషన్, లైవ్‌ యాక్టివిటీలను యాక్సెస్‌ చేసేందుకు ఆడియో ప్లేబ్యాక్‌కు.. ఐఫోన్‌ 16 వినియోగదారులు డైనమిక్‌ ఐలాండ్‌ ఇంటరాక్ట్ కావచ్చు. ఐఫోన్‌ 16 ప్రో 6.3 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ 6.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని టిప్‌స్టార్‌ రాస్ యంగ్ తెలిపారు. ఐఫోన్‌ 16 ప్రో మరియు ప్రో మ్యాక్స్‌ 3nm ప్రాసెస్‌ ఆధారంగా A18 ప్రో బయోనిక్‌ చిప్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌లో స్నాప్‌డ్రాగన్‌ X70ని కలిగి ఉంటుంది. ప్రో మోడళ్లు అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది. దేశీయ మార్కెట్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఐఫోన్‌ 15, ఐఫోన్ 15 ప్లస్‌ ఫోన్లు 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు నలుపు, నీలం, ఆకుపచ్చ, పింక్‌, పసుపు రంగుల్లో లభిస్తుంది. విడుదల సమయంలో ఐఫోన్‌ 15 బేస్‌ మోడల్‌ రూ.79,900, అలాగే ఐఫోన్ 15 ప్లస్‌ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఐఫోన్‌ 15, 15 ప్లస్‌ ఫోన్లు OLED సూపర్‌ రెటినా డిస్‌ప్లేతో వస్తాయి. గరిష్ఠ బ్రైట్‌నెస్‌ 2000 నిట్స్‌ వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లు వేర్వేరు డిస్‌ప్లే సైజులను కలిగి ఉంటుంది. ఐఫోన్ 15.. 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే 15 ప్లస్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు దృఢమైన గాజు, నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటాయి. 

Post a Comment

0 Comments

Close Menu