Ad Code

త్వరలో రిలీజ్‌ కానున్న ఐఓఎస్ 17.2 అప్‌డేట్ ?


యాపిల్ ఐఫోన్ డిజైన్‌, పర్ఫార్మెన్స్‌, కెమెరా ఫీచర్స్‌, సేష్టీ, సెక్యూరిటీ ఇలా అన్ని కేటగిరీల్లో ఐఫోన్‌ బెస్ట్‌ అని నిరూపించుకుంది. అందుకే సేల్స్‌ పరంగా, పాపులారిటీ పరంగా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. యాపిల్‌ ఫోన్ కొన్నాక కూడా సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ అందిస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇంప్రూవ్ చేస్తోంది. ప్రస్తుతం ఐఫోన్‌ల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ iOS 17.2ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది, ఇది అనేక కొత్త ఫీచర్లు, మార్పులు తీసుకువస్తుంది. అప్‌డేట్ 2023 డిసెంబర్‌లో యూజర్లకు అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇది అందుబాటులోకి వచ్చాక ఫోన్ సెట్టింగ్స్‌> జనరల్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కి వెళ్లి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కొత్త అప్‌డేట్ పొందిన తర్వాత ట్రాన్స్‌లేటర్ యాప్‌ను త్వరగా లాంచ్ చేసేందుకు డైనమిక్ ఐలాండ్‌ లోని యాక్షన్ బటన్‌ను ఉపయోగించవచ్చు. యూజర్లు వివిధ భాషల్లో కమ్యూనికేట్ చేయడానికి ఈ ట్రాన్స్‌లేటర్ అప్లికేషన్ యూజ్ అవుతుంది. కొత్త జర్నల్ యాప్‌తో సొంత డిజిటల్ జర్నల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాప్‌తో రోజును టెక్స్ట్, ఫొటోలు, మ్యూజిక్, మరిన్నింటితో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక లైవ్లీ డైరీ క్రియేట్ చేసుకోవచ్చు. యాప్ యాక్టివిటీ, మూడ్ ఆధారంగా సజెషన్స్ కూడా అందిస్తుంది. మెమోజీ బాడీ ఫీచర్‌లైన నడుము, బస్ట్, మరిన్నింటిని మరింత రియల్లిస్టిక్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పర్సనలైజ్డ్‌ లుక్ కోసం మెమోజీ బాడీని నచ్చినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొత్త ఫోకస్ ఫిల్టర్‌తో యాపిల్ మ్యూజిక్ లిజనింగ్ హిస్టరీని ఆఫ్ చేయవచ్చు. ఇది డివైజ్‌ను ఉపయోగించే ఇతర వ్యక్తులు యూజర్ మ్యూజిక్ రికమండేషన్స్ ప్రభావితం చేయకుండా అడ్డుకుంటుంది. కొత్త అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక కాంటాక్ట్ కీ వెరిఫికేషన్ ఫీచర్‌తో iMessage సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది హ్యాకర్లు కన్వర్జేషన్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తే యూజర్‌ను వెంటనే హెచ్చరిస్తుంది. జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు వంటి డిజిటల్ బెదిరింపులను ఎదుర్కొనే యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను యాపిల్ తీసుకొస్తోంది. మెసేజెస్ యాప్‌లో మెసేజ్‌లకు స్టిక్కర్లను యాడ్ చేసుకోవచ్చు, వాటిని మరింత ఫన్, ఎక్స్‌ప్రెసివ్‌గా చేయవచ్చు. వెదర్, క్లాక్ యాప్‌ల కోసం కొత్త విడ్జెట్లతో హోమ్, లాక్ స్క్రీన్‌లను కస్టమైజ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్స్ డైలీ వెదర్ అప్‌డేట్స్‌, డిజిటల్ వాచ్‌ను చూపుతాయి.


Post a Comment

0 Comments

Close Menu