Ad Code

టాప్ 20 సంపన్నుల జాబితాలో మళ్లీ గౌతమ్ అదానీ !


దానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మళ్లీ తన స్థానాన్ని తిరిగి పొందారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో ఆయన టాప్ 20 సంపన్నుల జాబితాలో మళ్లీ చోటు దక్కించున్నారు. అదానీ కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ రూ.1.33 లక్షల కోట్లకు పెరగడంతో సింగిల్ డేలోనే అదానీ సంపద రూ.లక్ష కోట్లకు పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. తద్వారా ఆయన ప్రపంచంలోని టాప్ 20 సంపన్నుల జాబితాలో నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం అదానీ 19వ స్థానాన్ని కలిగి ఉన్నారు. తన మొత్తం నికర విలువలో 6.5 బిలియన్ డాలర్లు పెరిగినట్టు తెలిపింది. అయినప్పటికీ, అదానీ మొత్తం నికర విలువ సంవత్సరానికి 53.8 బిలియన్ డాలర్లు తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రపంచంలోని టాప్ రేంజ్ 500 మంది సంపన్నుల జాబితాలో నికర విలువను పర్యవేక్షిస్తుంది. టెస్లా అధినేత ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అదానీ అంబానీలతో పాటు, షాపూర్ మిస్త్రీ, శివ్ నాడార్, సావిత్రి జిందాల్, అజీమ్ ప్రేమ్‌జీ, రాధాకిషన్ దమానీ, ఉదయ్ కోటక్‌లతో సహా 20 మంది భారతీయులు ఈ సంపన్నుల జాబితాలో ఉన్నారు.

Post a Comment

0 Comments

Close Menu