KTM కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అప్‌డేటెడ్ 390 అడ్వెంచర్ బైక్‌ను రివీల్ చేసింది. 2024 కేటీఎం 390 అడ్వెంచర్ పేరుతో ఈ టూవీలర్ గ్లోబల్ మార్కెట్లకు ఎంట్రీ ఇవ్వనుంది. 2024 కేటీఎం 390 అడ్వెంచర్ ఎడిషన్‌ను అప్‌డేట్ చేసేందుకు కంపెనీ పెద్దగా పెట్టుబడి పెట్టలేదు. అయితే ఇది అడ్వెంచర్ వైట్, అడ్వెంచర్ ఆరెంజ్ వంటి రెండు స్పెషల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కస్టమర్లు ఈ వెహికల్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో షోరూమ్‌లో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. 2024 కేటీఎం 390 అడ్వెంచర్ ఎడిషన్ 400cc సెగ్మెంట్ బైక్. ఇది ఆరెంజ్ కలర్ పెయింట్‌వర్క్‌తో వస్తుంది. స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో బాడీ వైట్ లేదా గ్రే కలర్ యాక్సెంట్ కాంబినేషన్‌లో ఉంటుంది. ఇది తప్ప బైక్ పాత ఎడిషన్‌కు కేటీఎం బ్రాండ్ పెద్దగా మార్పులు చేయలేదు. వెహికల్ స్ప్లిట్-ట్రెల్లిస్ ఫ్రేమ్‌తో వస్తుంది. దీనికి ముందు భాగంలో WP-Apex USD ఫోర్క్స్ సపోర్ట్ ఇస్తాయి. వెనుక భాగంలో WP-Apex మోనో-షాక్ సెక్షన్ ఇచ్చారు. కేటీఎం 390 అడ్వెంచర్‌లో కొన్ని అడ్వాన్స్‌డ్, ట్రెండింగ్ ఫీచర్లు ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, ABS సిస్టమ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, LED హెడ్‌ల్యాంప్ సెటప్, స్లిప్పర్ క్లచ్, హ్యాండిల్‌బార్-మౌంటెడ్ స్విచ్‌గేర్ వంటి స్పెసిఫికేషన్స్ దీని సొంతం. ఈ బైక్ 5-అంగుళాల కలర్ TFT డిస్ప్లేతో వస్తుంది. ఇది రైడర్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను డిస్‌ప్లే చేస్తుంది. 373.2 cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 43 bhp పవర్‌ను, 37 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. క్విక్-షిఫ్టర్, స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ ఫీచర్లతో స్మూత్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
2024 KTM 390 అడ్వెంచర్ బైక్ !
0
November 07, 2023
Tags