Ad Code

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23పై ఆఫర్ !


శాంసంగ్ కంపెనీ వెబ్‌సైట్‌లో వీక్ ఆఫర్ లో గెలాక్సీ ఎస్‌23 సిరీస్ ప్లస్ ఫోన్‌ను రూ. 94,999కే పొందవచ్చు. గెలాక్సీ ఎస్23 అలాగే 24 నెలల పాటు ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు దాదాపు రూ. 4 వేలు ఈఎంఐ పడుతుంది. 24 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవాలి. 256 జీబీ మెమరీ, 8 జీబీ ర్యామ్‌కు ఇది వర్తిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 35 వేల భారీ ఎక్స్చేంజ్ డీల్ కూడా లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే ఈ ఫోన్‌పై రూ. 5 వేల తగ్గింపు కూడా ఉంటుంది. అంటే అప్పుడు మీకు మరింత డిస్కౌంట్ వచ్చినట్లు అవుతుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది. అదనంగా రూ.8 వేల తగ్గింపు వస్తుంది. రెఫరల్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దీని ద్వారా రూ. 3500 వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా శాంసంగ్ స్మార్ట్ వాచ్ కూడా కలిపి కొంటే అదనపు తగ్గింపు వస్తుంది. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 1,16,999గా ఉంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఆక్టాకోర్ ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.6 ఇంచుల డిస్‌ప్లే, 4700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 5జీ స్మార్ట్‌ఫోన్. అందు వల్ల ప్రీమియం ఫోన్ కొనే ప్లానింగ్‌లో ఉన వారు ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్‌లో హైఎండ్ మోడల్ కూడా ఉంది. దీని రేటు ఇంకా ఎక్కువగా ఉంటుంది. మోడల్ వేరియంట్ ఆధారంగా ఆఫర్లు కూడా మారతాయి.

Post a Comment

0 Comments

Close Menu