Ad Code

బ్లూ ఓఎస్‌తో వివో వాచ్ 3 స్మార్ట్ వాచ్ !


వివో ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి కొత్త ప్రోడక్ట్ లను తీసుకొస్తుంది.. ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంది.. వివో వాచ్ 2 కు మంచి స్పందన వచ్చింది.. ఇప్పుడు వివో వాచ్ 3 ని మార్కెట్ లోకి తీసుకొని వచ్చేస్తుంది. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌.. త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. ఈ వాచ్ లో 1.43 ఇంచెస్‌తో కూడిన రౌండ్‌ స్క్రీన్‌ను అందించారు. బ్లూ ఓఎస్‌తో పనిచేయనున్న ఈ వాచ్‌లో 16 రోజులు లైఫ్‌ ఇచ్చే బ్యాటరీని అందించారు. పలు రకాల హెల్త్‌, ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ వంటి ఫీచర్లను కూడా అందించింది.. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌ ఇండియాలో ఎప్పుడు లాంచ్‌ కానుందన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. థిన్నర్‌ స్టైలిష్‌ డిజైన్‌తో రూపొందించారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ రొటేటింట్‌ క్రౌన్‌ను కూడా ఇచ్చారు.కుడివైపు బటన్‌తో పాటు కర్వ్‌డ్ గ్లాస్‌తో 3డీ ఎఫెక్ట్‌ను మరిపించేలా స్క్రీన్‌ను అందించారు..హార్ట్ రేట్ మానిటర్‌, ఎస్‌పీఓ2 సెన్సర్‌, అసాధారణ ఫ్లక్చువేషన్స్‌లో యూజర్లను అలర్ట్ చేసే ఫీచర్లను అందించారు.. ఇక ఈ వాచ్ లో స్లీప్‌, స్ట్రెస్‌ లెవల్స్‌ ట్రాక్స్‌ వంటి ఫీచర్లను అందించారు. ఇక ఈ వాచ్‌లో 505 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.. చైనాలో మంచి డిమాండ్ తో ఉన్న ఈ వాచ్ భారత్ లోకి త్వరలోనే రానుంది.. మరి ధర విషయానికొస్తే.. రూ.15 వేలు ఉంటుందని అంచనా..

Post a Comment

0 Comments

Close Menu