ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ 15 జీబీ వరకు ఉచిత క్లౌడ్ బ్యాకప్‌ను ప్రస్తుతం ఇస్తుంది. అది కాకుండా వాట్సాప్ చాట్ బ్యాకప్‌కు 5జీబీ అదనంగా ఇస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం వాట్సాప్ బ్యాకప్‌తో కలిపి మొత్తం 15 జీబీ డేటానే గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ చేసుకునే అవకాశం కల్పించబోతోంది. అంతకన్నా ఎక్కువ చాట్ బ్యాకప్ అయితే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ బీటా వినియోగదారులు ప్రీమియం చెల్లిస్తున్నారు. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్ల కూడా 15జీబీ బ్యాకప్ దాటితే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది. గూగుల్ డ్రైవ్‌లో ఒక్కో అకౌంట్‌కు 15 జీబీ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తుంది ఆ సంస్థ. ఈ స్టోరేజ్‌లోనే జీమెయిల్, గూగుల్ ఫొటోలు వంటివి బ్యాకప్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులు.. గూగుల్ వన్ సభ్యత్వాన్ని తీసుకోవాలని అలర్ట్‌లు ఇస్తోంది. గూగుల్ వన్ను సభ్యత్వాన్ని తీసుకునేందుకు నెలకు రూ.130 లేదా ఏడాదికి రూ.1300 చెల్లించాలి. అప్పుడు గూగుల్ 100 GB క్లౌడ్ స్టోరేజ్ అందిస్తుంది.
వాట్సాప్ చాట్ బ్యాకప్‌కు డబ్బులు చెల్లించాలా ?
0
November 15, 2023
Tags