Ad Code

విభిన్న ప్రతిభావంతుల కోసం 'హోండా' యూని వన్ !


విభిన్న ప్రతిభావంతు (అంగవైకల్యం) లకు సూపర్ టెక్నాలజీతో హోండా కంపెనీ  వీల్ చైర్ ను తయారు చేసింది. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో హోండా కంపెనీ టాప్ ఫైవ్ కంపెనీలో ఒకటిగా ఉంది. హోండా టూ వీలర్స్, హోండా కార్లు గురించి అందరికీ తెలిసిందే. మొదటిసారిగా హోండా పరిశోధన చేసి వికలాంగుల కోసం హోండా యూని వన్ పేరుతో దీన్ని తయారు చేసింది. ఈ యూని వన్ కేవలం నడవలేని వాళ్లకు మాత్రమే కాదు. నడుము కదిలించలేని వాళ్ళకి ఇంకా వెన్నుముక విరిగిన వాళ్ళకి కూడా పనిచేస్తుంది. ఇది మామూలు వీల్ చైర్లులా కాకుండా యూని వన్ లో హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ వీల్ చైర్ లో వెళ్తున్నప్పుడు అసలు సాధారణ మనిషి నడుస్తుంటే ఎలా ఉంటారో అలాంటి సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. దీని ఆపరేటింగ్ అంతా వీల్ చైర్ లో కూర్చున్న వ్యక్తి కనుసైగలను బట్టి ఉంటుంది. బాడీ మూమెంట్ ద్వారా కూడా యూని వన్ లో ఏ పక్కకు కావాలంటే ఆ పక్కకు ప్రయాణం చేయవచ్చు. చేతులను కదిలించే విధంగా వీల్ చైర్ కు ఎలాంటి మన్యువల్ ఆపరేటింగ్ సిస్టం ఇవ్వలేదు. ఇక ఇది పూర్తిగా బ్యాటరీ ఆపరేటర్ వీల్ చైర్. దీన్ని ఒక్కసారి చార్జీ చేస్తే కొన్ని రోజులపాటు వీల్ చైర్ పనిచేస్తుంది.మొత్తం నాలుగు చక్రాలను యూని వన్ కు బిగించారు. ఇవి పూర్తిగా హట్ డ్రైవ్ సిస్టం ద్వారా పనిచేస్తాయి. పైగా ఈ చక్రాలు ఎక్కడ బయటకు కనిపించవు.ఇంకా వృద్ధులు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా దీనికి ఒక జాయ్ స్టిక్ ని కూడా అమర్చుకునే ఎక్స్ ట్రా ఫిట్టింగ్ ఏర్పాటు చేసింది. ఈ యూనివన్ సహాయంతో వ్యక్తులు సాధారణ మనుషులు చేసే ఉద్యోగాలు కూడా ఈజీగా చేయొచ్చని హోండా కంపెనీ చెప్తుంది.

Post a Comment

0 Comments

Close Menu