Ad Code

వాట్సాప్ లో మెసేజ్‌లను వెతకడం ఇక ఈజీ !


వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. ప్రస్తుతం మనం వాట్సాప్ ఛాట్ సెక్షన్‌లోని పాత మెసేజ్‌లను చూసేందుకు కింది దాకా స్క్రోల్ చేస్తున్నాం. ఎంత పాత మెసేజ్‌ను మనం చూడాలని భావిస్తే అంతగా స్క్రోల్ చేస్తూ కింది దాకా మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇకపై ఈ పనంతా లేకుండా చేయడమే కొత్త ఫీచర్ ప్రత్యేకత. ఈ కొత్త ఫీచర్ వచ్చేశాక మన వాట్సాప్ సెర్చ్ బార్‌లో క్యాలెండర్ బటన్ ఒకటి వచ్చి చేరుతుంది. మనం ఆ క్యాలెండర్ బటన్‌ను క్లిక్ చేసి మెసేజెస్‌ను చెక్ చేయదల్చిన నెల, తేదీలను సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తేదీలో మనం పంపిన, మనకు వచ్చిన మెసేజ్‌లు అన్నీ ప్రత్యక్షం అవుతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.23.24.16 వర్షన్‌లో టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్‌ పనితీరును చూపించే ఒక స్క్రీన్‌షాట్‌ను 'వాట్సాప్‌ బీటా ఇన్ఫో' తాజాగా షేర్ చేసింది. తొలుత ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్ యూజర్స్‌కు అందుబాటులో వస్తుందని అంటారు. ఆ తర్వాత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల యూజర్స్‌కు కూడా అందుబాటులోకి తీసుకొస్తారని చెబుతున్నారు. వాయిస్, వీడియో కాల్స్ సమయంలో ఐపీ అడ్రస్‌ను హైడ్ చేసుకునే మరో ఫీచర్‌ను కూడా ఈవారం వాట్సాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా కాల్స్‌ చేసే యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే కమ్యూనికేషన్‌లోని కంటెంట్‌ను ఎవరూ యాక్సెస్ చేయలేరు. అయితే IP అడ్రస్ యూజర్ లొకేషన్, ఐడెంటిటీని ఎక్స్‌పోజ్ చేస్తుంది.


Post a Comment

0 Comments

Close Menu