Ad Code

వాట్సాప్‌ లో కొత్త అప్‌డేట్‌ ?


వాట్సాప్ చాట్స్ ట్యాబ్ నుంచి మెటా ఏఐ షార్ట్‌కట్‌ను హైడ్‌ చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. వాస్తవానికి యూజర్లు చాట్స్ ట్యాబ్ నుంచి నేరుగా AI- పవర్డ్ చాట్‌లను యాక్సెస్ చేయడానికి వీలుగా మెటా ఈ షార్ట్‌కట్‌ను క్రియేట్‌ చేసింది. అయితే దీనిపై చాలా మంది యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ షార్ట్‌కట్‌ను హైడ్‌ చేసుకునే ఆప్షన్‌ను వాట్సాప్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్‌ అప్‌డేట్‌కి సంబంధించి వాట్సాప్ బీటా ఇన్ఫో వివరాలను వెల్లడించింది. రెగ్యులర్‌ యాప్‌ యూసేజ్‌లో AI ఇంటరాక్షన్స్‌ ఇంటిగ్రేట్‌ చేయడానికి గతంలో షార్ట్‌కట్‌ ఇంప్లిమెంట్‌ చేశారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్‌ 2.23.25.15 లేటెస్ట్‌ వాట్సాప్‌ బీటా ఇన్‌స్టాల్ చేసిన వారికి, షార్ట్‌కట్‌ను హైడ్‌ చేసే ఫీచర్‌ లాంచ్ అయిందని రిపోర్ట్ పేర్కొంది. నివేదిక ప్రకారం చాట్‌ సెట్టింగ్స్‌లో కొత్త టోగుల్ అందుబాటులో ఉంటుంది. దీనిద్వారా మునుపటి అప్‌డేట్‌లో విడుదలైన చాట్స్ ట్యాబ్ నుంచి మెటా ఏఐ చాట్‌ను ఓపెన్‌ చేసే షార్ట్‌కట్‌ను యూజర్లు డిసేబుల్‌ చేయవచ్చు. మెటా ఏఐ అసిస్టెంట్‌తో చాట్‌ను ఓపెన్‌ చేయడానికి షార్ట్‌కట్‌ కనిపించాలంటే ఈ టోగుల్ చాలా ముఖ్యం. ఇప్పుడు యూజర్లకు దీన్ని డిసేబుల్‌ చేసే ఆప్షన్‌ కూడా లభించింది. అయితే యూజర్లకు ఇప్పటికే ఏఐ చాట్‌లకు యాక్సెస్ ఉంటే మాత్రమే ఈ షార్ట్‌కట్ అందుబాటులో ఉంటుంది. లేకపోతే, ఇంకొన్నాళ్లు యాప్ ఫ్యూచర్‌ అప్‌డేట్‌ కోసం వేచి చూడక తప్పదు. వాట్సాప్‌లో మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌తో ఎంగేజ్ కావడానికి చాలా మంది వినియోగదారులు తమ అయిష్టతను వ్యక్తం చేశారు. స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులతో ఇంటరాక్షన్స్ కోసం యాప్ వినియోగాన్ని పరిమితం చేయడం వారి ప్రాధాన్యత. దీంతోపాటు చాలా మంది వ్యక్తులు కొత్తగా ప్రవేశపెట్టిన షార్ట్‌కట్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారు, ఇది విజువల్‌గా నచ్చలేదని పేర్కొన్నారు. వాట్సాప్ మోడర్న్‌ ఇంటర్‌ఫేస్‌తో యాప్‌ను రీడిజైన్‌ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. మెటా ఏఐ షార్ట్‌కట్‌ను చాట్స్ ట్యాబ్ నుంచి హైడ్‌ చేసే ఆప్షన్‌ ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి లేటెస్ట్‌ వాట్సాప్ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసే స్పెసిఫిక్‌ బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ రాబోయే కొద్ది రోజుల్లో మరింత మంది యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Post a Comment

0 Comments

Close Menu