Ad Code

విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా విప్లవాత్మక మార్పు !


విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజాగా గూగుల్‌ చాట్ బాట్‌ బార్డ్‌లో తీసుకొచ్చిన ఓ కొత్త ఫీచర్‌ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది.మొదట్లో అమెరికా, యూకేలో అందుబాటులోకి వచ్చిన గూగుల్ బార్డ్‌ ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం గూగుల్‌ బార్డ్‌ను భారత్‌తో పాటు 108 దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోన్న గూగుల్‌ తాజాగా విద్యార్థుల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. సైన్స్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సలహాలు, పాఠశాలలు, కాలేజ్ స్టూడెంట్స్‌కి ఉపయోగపడేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు మ్యాథ్స్, సైన్స్, క్లిష్టమైన సమస్యలకు సమాధానాలను సులభమైన విధానంలో తెలుసుకునేలా బార్డ్‌ను అప్‌డేట్ చేశారు. ఇందుకోసం యూజర్లు తమకు కావాల్సిన సమస్యను టైప్‌ చేయడం లేదా ఫొటోను అప్‌లోడ్ చేస్తే చాలు సమస్యను ఎలా పరిష్కరించవచ్చో సులభమైన విధానాన్ని చాట్‌బాట్‌ అందిస్తుంది. విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా చార్ట్‌లు, టేబుల్స్‌ రూపంలో ఉంటాయి. వీటితో పాటు అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన సూచనలు కూడా పొందవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu