గూగుల్ కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను ఈ వారం భారతదేశంతో సహా మరిన్ని దేశాలకు విడుదల చేస్తోంది. కారు ప్రమాదానికి గురైతే, ఈ ఫీచర్ క్షణాల్లోనే ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కోసం ఎమర్జెన్సీ సర్వీసెస్‌కి కాల్ చేస్తుంది. యూజర్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు మెసేజ్ పంపిస్తుంది. ఈ సేఫ్టీ ఫీచర్ క్రాష్‌ను గుర్తించి, ఎమర్జెన్సీ సర్వీసులను అలర్ట్ చేయడానికి ఆండ్రాయిడ్ ఫోన్‌లోని సెన్సార్లను ఉపయోగిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో కారు క్రాష్ డిటెక్షన్ డిఫాల్ట్‌గా ఎనేబుల్ అవ్వదు. రెండు సింపుల్ స్టెప్స్‌లో దీన్ని మాన్యువల్‌గా ఆన్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లాలి. సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ఆప్షన్‌పై నొక్కాలి. కార్ క్రాష్ డిటెక్షన్‌పై క్లిక్ చేసి దాని టోగుల్ ఆన్ చేయాలి. కారు క్రాష్ అయినప్పుడు ముందుగా ఎవరికీ తెలియాలో ఎంచుకునే ఆప్షన్ కూడా ఈ ఫీచర్ అందిస్తుంది. ఆ ఆప్షన్‌తో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ జోడించడం ద్వారా ప్రియమైన వారికి ప్రమాదాల గురించి త్వరగా తెలియజేయవచ్చు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక, యూజర్ కారు ప్రమాదంలో ఉన్నారో లేదో గుర్తించడానికి ఫోన్ యాక్సిలరోమీటర్, మైక్రోఫోన్ వంటి సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. ఇది క్రాష్‌ను గుర్తిస్తే, యూజర్ దృష్టిని ఆకర్షించడానికి వైబ్రేట్ అవుతుంది, లౌడ్‌గా రింగ్ అవుతుంది. హెల్ప్ కావాలా అని యూజర్‌ను అడుగుతుంది. సమాధానంగా "ఎస్" అని చెప్పవచ్చు లేదా స్క్రీన్‌పై "ఐ నీడ్ హెల్ప్"పై క్లిక్ చేయాలి. ఒకవేళ యూజర్ కొన్ని సెకన్ల పాటు ఏమాత్రం స్పందించకపోతే, అది ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ నంబర్ 112కి కాల్ చేస్తుంది. క్రాష్ జరిగిన లొకేషన్, క్రాష్ వివరాలను వారితో పంచుకుంటుంది. యూజర్ ఏదైనా చెబితే దానిని ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు కూడా సెండ్ చేస్తుంది. యూజర్ లొకేషన్, క్రాష్ వివరాలు కూడా పంపుతుంది. కార్ క్రాష్ డిటెక్షన్ అన్ని క్రాష్‌లను గుర్తించకపోవచ్చు, ఏ ప్రమాదం జరగనప్పుడు కూడా క్రాష్ అయినట్లు గుర్తించవచ్చు. అందువల్ల, ఈ ఫీచర్ 100% పర్ఫెక్ట్ కాదని ఆల్రెడీ గూగుల్ హెచ్చరిస్తుంది. ఇది ఫోన్ బ్యాటరీ లెవెల్, నెట్‌వర్క్ కనెక్షన్, లొకేషన్ సెట్టింగ్స్‌పై కూడా ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి, భద్రత కోసం ఈ ఫీచర్‌పై మాత్రమే ఆధారపడకూడదు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఎల్లప్పుడూ ఇతర సహాయాన్ని కోరాలి. కార్ క్రాష్ డిటెక్షన్ ప్రస్తుతం పిక్సెల్ 4a నుంచి ప్రారంభమయ్యే పిక్సెల్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 11 లేదా తర్వాతి వెర్షన్‌పై రన్ అవుతూ ఉండాలి. ఫీచర్ కొన్ని భాషలు, ప్రాంతాలకు కూడా పరిమితం అయ్యింది. భారతదేశంలో ఫీచర్ ప్రస్తుతం ఇంగ్లీష్ భాషకు మాత్రమే సపోర్ట్ ఇస్తుంది. గూగుల్ ఈ వారం మరిన్ని దేశాలకు కార్ క్రాష్ డిటెక్షన్ కోసం మద్దతును విస్తరిస్తోంది. ఆ దేశాల్లో భారతదేశం, ఆస్ట్రియా, బెల్జియం, పోర్చుగల్, స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఈ దేశాలు ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, సింగపూర్, స్పెయిన్, UK, US వంటి కార్ క్రాష్ డిటెక్షన్ అందుబాటులో ఉన్న దేశాల జాబితాలో చేరాయి.
గూగుల్ లైఫ్ సేవింగ్ ఫీచర్ !
0
November 02, 2023
Tags