చాలా మంది చేతికి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అదే ఉంగరం స్మార్ట్ సాధనంగా మారింది. చేతికి పెట్టుకున్న ఉంగరంతోనే నగదు రహిత చెల్లింపులు చేసుకునే వెసులుబాటు తీసుకొచ్చారు. దీన్నే స్మార్ట్ రింగు అంటారు. ఎలాంటి డెబిట్, క్రెడిట్ కార్డులతో పని లేకుండా పేటీఎం, ఫోన్‌పేలు కూడా అక్కర్లేకుండా ఈ రింగుతో చెల్లింపులు చేసుకోవచ్చు. హాంగ్ కాంగ్‌కు చెందిన టాప్పీ అనే సంస్థ ఈ స్మార్ట్ రింగును అభివృద్ధి చేసింది. ఈ రింగ్ స్మార్ట్ వైర్ లెస్ పేమెంట్ చిప్‌లను కలిగి ఉంటుంది. ఈ రింగ్ ఫోన్ యాప్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. ఫోన్ లో ఉన్న సదరు యాప్ నుంచి యూజర్ బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసుకోవాలి. ఇక ఏ స్టోర్‌లోనైనా పేమెంట్ మిషన్ దగ్గర ఈ రింగును చూపించి సులువుగా చెల్లింపులు చేసుకోవచ్చు. పైగా ఈ రింగ్‌ను చార్జింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదట. ఈ రింగ్ సాంకేతికతను జ్యుయలరీ కంపెనీలకు అందిస్తే వెండి, బంగారంతో కూడా స్మార్ట్ రింగ్‌లను తయారు చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ రింగ్ మన దగ్గరకు కూడా వచ్చేసింది. స్వదేశీ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ స్టార్టప్ 'సెవెన్' అనే కంపెనీ '7 రింగ్' పేరిట కాంటాక్ట్‌లెస్ చెల్లింపు కోసం ఈ స్మార్ట్ వేరబుల్ రింగ్‌ను లాంచ్ చేసింది. ఎన్‌పీసీఐ సహకారంతో భారతీయ బ్రాండ్ 7 అభివృద్ధి చేసింది. ప్రీమియం జిర్కోనియా సిరామిక్ మెటీరియల్‌తో ఇది రెడీ చేస్తున్నారు. ఇది 7 వేర్వేరు సైజులలో ఇది లభిస్తుంది.
స్మార్ట్ రింగుతోనే నగదు రహిత చెల్లింపులు !
0
November 12, 2023
Tags