Ad Code

క్రాస్‌బీట్స్ నెక్సస్‌ స్మార్ట్‌వాచ్ విడుదల !


క్రాస్‌బీట్స్ సంస్థ నెక్సస్‌ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. నెక్సస్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్‌ చాట్‌జీపీటీ టెక్నాలజీతో వచ్చిన భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ అని కంపెనీ పేర్కొంది. వాయిస్ కమాండ్స్ అర్థం చేసుకోగల, రియాక్ట్ అవ్వగల పవర్‌ఫుల్ ఏఐ చాట్‌బాట్. చాట్‌జీపీటీ నేచురల్ కన్వర్జేషన్లను జనరేట్ చేయడానికి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్‌పై ఆధారపడుతుంది. ఇది యూజర్ల ప్రశ్నలకు సమాధానమివ్వగలదు, సజెషన్స్ ఫాలో అవుతూ మనుషుల లాగానే తెలివైన చాట్ చేయగలదు. చాట్‌జీపీటీ అనేది GPT-3 మోడల్‌పై ఆధారపడింది. ఇది ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ మోడల్స్‌లో ఒకటి. చాట్‌జీపీటీ స్పోర్ట్స్, వెదర్, న్యూస్, ట్రివియా, జోకులు వంటి విభిన్న టాపిక్స్‌ గురించి సమాధానం ఇవ్వగలరు. వాయిస్ చాట్ ద్వారా దీంతో కమ్యూనికేట్ కావచ్చు. నెక్సస్ చాట్‌జీపీటీతో కమ్యూనికేట్ చేయగలిగేలా ఇన్‌-బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్‌తో వస్తుంది. "హే నెక్సస్" అని చెప్పడం ద్వారా లేదా స్క్రీన్‌పై నొక్కడం ద్వారా చాట్‌జీపీటీని యాక్టివేట్ చేయవచ్చు. "ప్లే మ్యూజిక్", "సెట్ రిమైండర్" లేదా "టెల్ మీ ఏ జోక్" వంటి ప్రశ్నలను వాయిస్ రూపంలో చాట్‌జీపీటీని అడగవచ్చు. వీటికి ప్రశ్నలను ఆడియో రూపంలోనే చాట్‌జీపీటీ వినిపిస్తుంది. నెక్సస్‌లో చాట్‌జీపీటీని ఉపయోగించడానికి, స్మార్ట్‌ఫోన్‌లో చాట్‌జీపీటీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, స్మార్ట్‌వాచ్ ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలి. చాట్‌జీపీటీ క్లౌడ్ కంప్యూటింగ్‌పై ఆధారపడి యూజర్లతో ఇంట్రాక్ట్ అవుతుంది. కాబట్టి స్ట్రాంగ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ని కూడా కలిగి ఉండాలి. ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వేగంగా ఉంటే, చాట్‌జీపీటీ అంత వేగంగా ఆన్సర్స్ ఇస్తుంది. ఈ డివైజ్ చాట్‌జీపీటీతో పాటు, నెక్సస్ అనేక ఇతర ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. నెక్సస్ 2.1-అంగుళాల AMOLED యాంటీ-గ్లేర్ స్క్రీన్‌తో క్రిస్టల్ క్లియర్ కలర్స్, డీటైల్స్ చూపించగలదు. యాంబియంట్ లైట్‌కు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేయగలదు, తద్వారా బ్యాటరీని సేవ్ చేస్తూనే కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. నెక్సస్‌లో 500 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి, సొంత కస్టమ్ వాచ్ ఫేస్‌ని కూడా సృష్టించవచ్చు. నెక్సస్‌లో శారీరక శ్రమ, ఆరోగ్యాన్ని పర్యవేక్షించగల మల్టీస్పోర్ట్స్ ట్రాకింగ్ ఫంక్షన్‌ను కూడా కలిగి ఉంది. నెక్సస్ స్టెప్స్, కేలరీలు, హార్ట్ బీట్‌ రేటు, రక్తపోటు, బ్లడ్ ఆక్సిజన్, ఫ్లిప్ క్వాలిటీని ట్రాక్ చేయగలదు. నెక్సస్ రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా వంటి విభిన్న స్పోర్ట్స్ మోడ్స్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. నెక్సస్ డేటాను స్మార్ట్‌ఫోన్‌తో సింక్ చేస్తుంది. ఫిట్‌నెస్, వెల్‌నెస్‌ను ఎలా మెరుగుపరచాలనే దానిపై ఫీడ్‌బ్యాక్, సజెషన్స్ అందిస్తుంది. 20mAh బ్యాటరీతో సింగిల్ ఛార్జ్‌పై 6 రోజుల వరకు బ్యాకప్ ఆఫర్ చేస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. నెక్సస్ ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ ద్వారా వాటితో కనెక్ట్ అవుతుంది. నెక్సస్ స్మార్ట్‌ఫోన్ నుంచి కాల్స్‌, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌, సోషల్ మీడియా వంటి నోటిఫికేషన్లను చూపుతుంది. నెక్సస్ ధర రూ.4,999, అఫీషియల్ క్రాస్‌బీట్స్ వెబ్‌సైట్ లేదా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి నెక్సస్ వాచ్ ని కొనుగోలు చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu