వాట్సాప్ 'స్టేటస్ అప్‌డేట్స్ ఫిల్టర్' పేరుతో ఒక యూజ్‌ఫుల్ ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. దీనితో యూజర్లు స్టేటస్ అప్‌డేట్లను ఫిల్టర్ చేసుకోవచ్చు. అంతేకాదు వెర్టికల్ లిస్ట్‌లో స్టేటస్ అప్‌డేట్లను చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.23.25.3 వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్న కొంతమంది యూజర్లకు కొత్త ఫీచర్ విడుదల అవుతోంది. అప్‌డేట్ అందుకున్న యూజర్లు ఇప్పుడు మ్యూట్ చేసిన స్టేటస్ అప్‌డేట్‌లను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. వాట్సాప్ అప్‌డేట్‌లను ట్రాక్ చేసే వాట్సాప్ బీటా ఇన్ఫో, ఈ కొత్త స్పెసిఫికేషన్ గురించి మరిన్ని విశేషాలు వెల్లడించింది. వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ ప్రకారం, బీటా టెస్టర్లు "అప్‌డేట్స్" ట్యాబ్‌లో స్టేటస్ సెక్షన్ కింద కొత్తగా "సీ ఆల్ " బటన్‌ను చూస్తారు. దానిపై క్లిక్ చేయగానే అన్ని స్టేటస్ అప్‌డేట్స్ వర్టికల్ లిస్టులో కనిపిస్తాయి. ఈ లిస్టుపైన స్టేటస్ అప్‌డేట్స్ ఫిల్టర్ చేసుకోవడానికి వీలుగా నాలుగు ఫిల్టర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ ఫిల్టర్స్‌లో ఆల్ , రీసెంట్, వ్యూయిడ్, మ్యూటెడ్ ఉన్నాయి. వీటిలో "ఆల్" పైన నొక్కితే అన్ని స్టేటస్ అప్‌డేట్స్ కనిపిస్తాయి. "రీసెంట్"పై ట్యాప్ చేస్తే లేటెస్ట్ స్టేటస్‌లు మాత్రమే డిస్‌ప్లే అవుతాయి. దీనివల్ల ఓల్డ్ స్టేటస్‌లు స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా మోస్ట్ రీసెంట్‌వి సింపుల్‌గా చూసుకోవచ్చు. మిగతా ఫిల్టర్స్ పేరు సూచించినట్లుగానే పనిచేస్తాయి. ఈ ఫిల్టర్లు కాంటాక్ట్‌ల అన్ని స్టేటస్ అప్‌డేట్‌లను కేటగిరీ వైజ్‌గా చూపుతాయి, యూజర్లు కాంటాక్ట్‌ల ఏ అప్‌డేట్‌లను మిస్ కాకుండా షేర్ చేసిన ప్రతిదానిని తెలుసుకునేందుకు వీలు కల్పిస్తాయి. యూజర్లు ప్రస్తుత ప్రాధాన్యతలకు సరిపోయే నిర్దిష్ట ఫిల్టర్‌ను ఎంచుకోవడం ద్వారా చూడాలనుకుంటున్న కంటెంట్‌ను సులభంగా చూసుకోవచ్చు.
వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్ ఫిల్టర్ ఫీచర్ !
0
November 21, 2023
Tags