రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు నేటి నుంచే ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ల వరకు అన్నింటిపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 , మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ డీల్స్ నవంబర్ 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 14 ధర రూ.61,999గా ఉంటుంది. కానీ ఫ్లిప్‌కార్ట్ ఈ దీపావళి సేల్‌లో దానిని రూ.54,999కే అందుబాటులో ఉంచింది. అయితే బ్యాంక్ డిస్కౌంట్ కింద రూ.4,000, ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.1000 అప్లై చేస్తే.. ఈ దీపావళి సేల్‌లో ఐఫోన్ 14ను కేవలం రూ.49,999కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ ధర ప్రస్తుతం రూ.79,900 వరకు ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో దీనిని కేవలం రూ.59,999కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్‌లో మోటోరోలా 40 మోడల్ రూ.25,999కు లభిస్తోంది. నథింగ్ ఫోన్ ఈ ఫెస్టివ్ సేల్‌లో రూ.33,999కు అందుబాటులో ఉంది. వివో టీ 2 ప్రో రూ.21,999కే కొనుగోలు చేయవచ్చు. పోకో ఎక్స్ 5 ప్రో ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.18,499కే సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ F14 5జీ మొబైల్‌పై ఈ సేల్‌లో రూ.9000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ F34 5G Model రూ.14,999కే లభిస్తోంది. పిక్సెల్ 7ఏ ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.31,499కు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ నియో ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో మొబైల్స్‌పై భారీ ఆఫర్స్ !
0
November 01, 2023
Tags