Ad Code

కాంటాక్ట్‌ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్‌ను చాట్ విండోలోనే చూసే ఆప్షన్ ?


వాట్సాప్ చాట్ విండోలోనే కాంటాక్ట్‌ల ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ చూపే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. దీనితో చాట్ ఇన్ఫో స్క్రీన్‌ను ఓపెన్ చేయకుండానే చాట్‌ కన్వర్జేషన్‌లోనే నేమ్, స్టేటస్, ప్రొఫైల్ పిక్చర్ చూడవచ్చు. అవతలి వ్యక్తి లాస్ట్ సీన్ ప్రైవసీ సెట్టింగ్స్‌ ఎనేబుల్ చేసి ఉంటే, వారి కాంటాక్ట్‌ల లాస్ట్ సీన్ కూడా చూడవచ్చు. ఈ ఫీచర్‌తో ఇతరుల కాంటాక్ట్‌ల ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్‌లో కొత్త మార్పులను చాలా క్విక్, ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు, అలానే ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వాట్సాప్ అప్‌డేట్‌ ట్రాకర్‌ వాట్సాప్‌ బీటా ఇన్ఫో ప్రకారం, ప్రొఫైల్ ఇన్ఫో - చాట్ స్క్రీన్ అని పిలిచే అప్‌కమింగ్ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా లేటెస్ట్ 2.23.25.11 అప్‌డేట్‌లో ఇది కనిపించింది. ఈ ఫీచర్‌ను చాలా మంది యూజర్లు చాలా ఏళ్లుగా రిక్వెస్ట్ చేశారని, వాట్సాప్ ఎట్టకేలకు దీన్ని యాడ్ చేస్తోందని వాట్సాప్‌ బీటా ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది. చాట్ విండోలో ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ చూపడం ద్వారా యూజర్లు ఇంటరాక్ట్ కావడానికి మరింత కన్వీనియంట్, ఇమీడియట్ వే అందించవచ్చని వెబ్‌సైట్ తెలిపింది. ఉదాహరణకు, ప్రొఫైల్ పిక్చర్‌ను ఫుల్ స్క్రీన్‌లో చూడటానికి దానిపై క్లిక్ చేయవచ్చు లేదా అప్‌డేటెడ్ స్టేటస్‌ను వెంటనే చూడవచ్చు. ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్‌ను కాపీ చేయడానికి లేదా ఇతరులతో షేర్ చేయడానికి దానిపై లాంగ్ ప్రెస్ చేయవచ్చు. ఈ ఫీచర్ పనితీరుకు సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకుంది. ఆ స్క్రీన్‌షాట్‌లో ఒక కన్వర్జేషన్ లేదా చాట్ ఓపెన్ చేసినప్పుడు కాంటాక్ట్ నేమ్ కింద ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కనిపించింది. అయితే, ఇతర కాంటాక్ట్‌లు ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ చూడటానికి యూజర్‌ను అనుమతించితేనే ఈ ఫీచర్ పని చేస్తుంది. వారు పేరు, స్టేటస్ లేదా ప్రొఫైల్ పిక్చర్ హైడ్ చేసి ఉంచితే, యూజర్ వాటిని చాట్ విండోలో చూడలేరు. అలానే బ్లాక్ చేసినా లేదా ఫోన్ నుంచి నంబర్‌ను తొలగించినా వారి ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్‌ను చూడలేరు.

Post a Comment

0 Comments

Close Menu