Ad Code

వాట్సాప్‌లో 'ఐపీ ప్రొటెక్ట్' !


వాట్సాప్ ఇటీవల ఐపీ ప్రొటెక్ట్ అనే కొత్త ప్రైవసీ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ మీ ఐపీ అడ్రస్‌ను వాట్సాప్ కాల్‌లో పాల్గొనే ఇతర యూజర్ల నుంచి కనిపించకుండా హైడ్ చేస్తుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడం ద్వారా మీ కాల్‌లు నేరుగా మీ డివైజ్‌ల మధ్య కాకుండా వాట్సాప్ సర్వర్‌ల ద్వారా రన్ అవుతాయి. అంటే.. మీ లొకేషన్ ట్రాక్ చేయడం ఇతరులకు మరింత కష్టతరం చేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫీచర్ పరిమిత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది. వాట్సాప్ కాల్‌లో పాల్గొనే ఇతర యూజర్ల నుంచి మీ IP అడ్రస్ హైడ్ చేసుకోవచ్చు. మీ లొకేషన్ ట్రాక్ చేయకుండా ఇతరులను నివారిస్తుంది. మీ వాట్సాప్ కాల్‌లకు అదనపు సెక్యూరిటీని యాడ్ చేస్తుంది. మీరు ప్రైవసీకి అడ్వాన్సడ్ లేయర్ కూడా కోరుకుంటే, మీరు వాట్సాప్ ఐపీ ప్రొటెక్ట్ ఫీచర్‌ను సులభంగా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి ఈ దిగువన పేర్కొన్న విధంగా ఫాలో అవ్వండి. ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రి-డాట్స్ నొక్కి సెట్టింగ్‌లపై ట్యాప్ చేయండి. ఆ తరువాత  'ప్రైవసీ'పై ట్యాప్ చేసి అడ్వాన్సడ్ సెక్షన్ కిందికి స్క్రోల్ చేయండి. కాల్స్‌లో ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఆప్షన్ ట్యాప్ చేయండి. స్విచ్‌పై టోగుల్ చేయండి. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయగానే మీరు వాట్సాప్‌లో కాల్ చేసే యూజర్ల నుంచి మీ ఐపీ అడ్రస్ హైడ్ అవుతుంది. ఈ ఫీచర్ ద్వారా మీ లొకేషన్ ట్రాక్ చేయడం ఇతరులకు కష్టతరం అవుతుంది. దయచేసి ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేయడం వల్ల మీ కాల్‌ల క్వాలిటీ కొద్దిగా ప్రభావితం కావచ్చని గుర్తుంచుకోండి. ఎందుకంటే.. మీ కాల్‌లు నేరుగా మీ డివైజ్‌ల మధ్య కాకుండా వాట్సాప్ సర్వర్‌ల ద్వారా పంపడం జరుగుతుంది.

Post a Comment

0 Comments

Close Menu