Ad Code

అరచేతినే స్మార్ట్‌ఫోన్‌గా మార్చనున్న ఏఐ పిన్ !


డిస్‌ప్లే లేకుండా స్మార్ట్‌ఫోన్‌లా పనిచేసే ఈ వండర్ ఏఐ పిన్‌ను హ్యుమనె కంపెనీ త్వరలో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. మీ షర్ట్‌కు లేదా జాకెట్‌కు చిన్న ల్యాపెల్ పిన్ లేదా క్లిప్ ధరించి ఎన్నో పనులు చక్కబెట్టే రోజులు రానున్నాయి. ఈ విషయం నమ్మలేకున్నా సాధ్యమయ్యే రోజు దగ్గర్లోనే ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. డిస్‌ప్లే లేకుండా స్మార్ట్‌ఫోన్‌లా పనిచేసే ఈ వండర్ ఏఐ పిన్‌ను హ్యుమనె కంపెనీ లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా అందుబాటులోకి రానున్న ఈ ఏఐ పిన్ బింగ్‌, చాట్‌జీపీటీ వంటి జనరేటివ్‌ ఏఐ టూల్స్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్స్ తర్వాతి దశపై ఏఐ కంపెనీ హ్యూమనె చాలా కాలంగా కసరత్తు సాగిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లా వ్యవహరిస్తూ అన్ని పనులను చక్కబెట్టే డిస్‌ప్లే రహిత గాడ్జెట్ గురించి హ్యూమనె ఎప్పటినుంచో మాట్లాడుతోంది. అయితే సంప్రదాయ స్మార్ట్‌ఫోన్ స్పేస్‌ను ఇది భర్తీ చేయదని చెబుతున్నారు. ఇక ఏఐ పిన్‌ను షర్ట్‌కు క్లిప్ చేయవచ్చు. డెస్క్ వద్ద పనిచేసుకునే సమయంలో టేబుల్‌పై ఉంచవచ్చు. ఏఐ పిన్‌లో ఉండే గ్రీన్ లేజర్ ఇన్ఫర్మేషన్‌ను మీ అరచేతిపై చూపుతుంది. అరచేతిని ట్యాప్ చేస్తూ కాల్స్ చేయడంతో పాటు మెసేజ్‌లు టైప్ చేయవచ్చు. మీ అరచేతినే ఏఐ పిన్‌ స్మార్ట్‌ఫోన్‌గా మార్చేస్తుంది. ఏఐ పిన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు కెమెరా, డెప్త్‌, మోషన్ సెన్సర్స్‌, బిల్టిన్ స్పీకర్‌ను కలిగిఉంటుంది. ఇక బ్యాటరీలను చార్జి చేయడం, మార్చడం ద్వారా పూర్తి డివైజ్‌కు చార్జింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.

Post a Comment

0 Comments

Close Menu