Ad Code

చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్‌ తొలగింపు !


చాట్‌జీపీటీ సీఈవో  శామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించిన తర్వాత మీరా మురాటికి కంపెనీ బాధ్యతలు అప్పగించారు. ఆమె ఇప్పుడు తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. మీరా 2018లో టెస్లా కంపెనీని విడిచిపెట్టిన తర్వాత OpenAI లో చేరారు. ఓపెన్ AI శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో “కంపెనీ దాని సహ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్‌మాన్‌ను తొలగించింది. బోర్డుతో కమ్యూనికేట్ చేయడంలో శామ్ నిరంతరం నిర్లక్ష్యం చేస్తున్నాడని కంపెనీ బోర్డు గుర్తించింది.” అని ప్రకటనలో తెలిపింది. “మేము తాత్కాలిక CEOగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటిని నియమిస్తున్నాము. దీనితో పాటు మేము ఈ పదవిని నిర్వహించడానికి శాశ్వత CEO కోసం కూడా వెతుకుతున్నాము” అని కంపెనీ తెలిపింది. మీరా నియామకంకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ OpenAI ఒక ప్రకటనలో ఇలా చెప్పింది. మీరా సుదీర్ఘ పదవీకాలం, AI గవర్నెన్స్ మరియు పాలసీలో ఆమె అనుభవం, అలాగే కంపెనీకి సంబంధించిన అన్ని అంశాలతో ఆమె ఈ పాత్రకు అర్హత కలిగి ఉందని బోర్డు విశ్వసిస్తోందని తెలిపింది. 1988లో అల్బేనియాలో మీరా జన్మించింది. ఆమె తల్లిదండ్రులు భారతీయ సంతతికి చెందినవారని చాలా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కెనడాలో చదువు పూర్తి చేసింది. ఆమె మెకానికల్ ఇంజనీర్. టెస్లాలో పనిచేస్తున్నప్పుడు మోడల్ ఎక్స్ టెస్లా కారును తయారు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. 2018 సంవత్సరంలో ఆమె ChatGPT మాతృ సంస్థ అయిన Open AIలో పని చేయడం ప్రారంభించింది. మీరా గతేడాది ఓపెన్‌ఏఐకి CTO అయ్యారు.


Post a Comment

0 Comments

Close Menu