Ad Code

యాపిల్ ఫోన్లలో ఫింగర్‌ప్రింట్‌ టెక్నాలజీకి గుడ్ బై ?


యాపిల్ భవిష్యత్ ఐఫోన్‌ల నుంచి టచ్ ఐడీ ఫీచర్‌ను దశలవారీగా తొలగించాలని యోచిస్తోంది.ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఎక్స్‌పర్ట్ వీబోలో ఇటీవల చేసిన పోస్ట్ ప్రకారం టచ్ IDతో యూజర్లు ఫింగర్‌ప్రింట్‌తో ఐఫోన్లను అన్‌లాక్ చేసుకోవచ్చు. బడ్జెట్ రేంజ్ నుంచే దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ ఫీచర్‌ను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఐఫోన్లలో ఈ ఫీచర్‌ను శాశ్వతంగా తొలగించాలని యాపిల్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ X నుంచి యాపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌లలో టచ్ ID ఫీచర్ తొలగిస్తూ వస్తోంది. దీనికి బదులుగా ఐఫోన్ X నుంచి ఫేస్ IDని ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌గా అందిస్తోంది. వీబో పోస్ట్ ప్రకారం, యాపిల్ టచ్ ID కోసం ప్రాసెసర్లను తయారు చేయడం లేదు. టచ్ ID ఫింగర్‌ప్రింట్ రికగ్నిషన్ సిస్టమ్ పనిచేయడానికి వీలు కల్పించే ప్రత్యేక భాగాల తయారీని యాపిల్ పర్మినెంట్‌గా షట్‌డౌన్ చేసింది. అంటే చిప్‌సెట్స్‌లో ఇకపై టచ్ ID టెక్నాలజీ కనిపించదు. అయితే ప్రస్తుతం మిగిలి ఉన్న చిప్స్‌ను ఐఫోన్ SE 3 కోసం ఉపయోగిస్తారు. ఐఫోన్ SE 3 వచ్చే ఏడాది విడుదల కానుంది. ఐఫోన్ SE 3 టచ్ IDని కలిగి ఉన్న చివరి ఐఫోన్ అవుతుంది. పోస్ట్ ప్రకారం, ఐఫోన్ SE 4 ఫేస్ IDకి మారుతుంది. 2024లో విడుదల కానున్న ఐఫోన్ 16 సిరీస్‌కు యాపిల్ టచ్ IDని తిరిగి తీసుకువస్తుందనే పుకార్లకు మద్దతు ఇవ్వడానికి నమ్మదగిన ఆధారాలు లేవని మ్యాక్‌రూమర్స్ (MacRumours) నివేదించింది. దీనర్థం యాపిల్ టచ్ IDని పూర్తిగా వదిలివేసి, ఐఫోన్‌ల కోసం మెయిన్ బయోమెట్రిక్ అథెంటికేషన్‌గా ఫేస్ ID ఇవ్వడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఫేస్ ID ఫీచర్ యూజర్ ఐడెంటిటీ వెరిఫై చేయడానికి యూజర్ ఫేస్ 3D స్కాన్‌పై ఆధారపడుతుంది, ఇది టచ్ ID కంటే మరింత సురక్షితమైనది, అనుకూలమైనదని యాపిల్ పేర్కొంది. అయితే, కొంతమంది యూజర్లు సింపుల్‌గా, ఫాస్ట్‌గా అన్‌లాక్ చేయగల టచ్ IDని ఇష్టపడవచ్చు, ప్రత్యేకించి మాస్క్ లేదా సన్ గ్లాసెస్ ధరించిన సందర్భాల్లో ఫేస్ ID పనిచేయకపోతే టచ్ IDని ఉపయోగించడానికి మొగ్గు చూపవచ్చు. కానీ భవిష్యత్తులో వారికి నిరాశే ఎదురవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu