మెటా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. సొంత ప్రొడక్ట్స్, సర్వీసులలో AI ఫీచర్లు రిలీజ్ చేస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచాలని యోచిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యూజర్లకు రెండు ఏఐ ఫీచర్లు అందించింది. వీడియోలను సులభంగా ఎడిట్ చేసుకోగలిగేలా ఈ రెండు ఫీచర్లను పరిచయం చేసింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఫీచర్లు టెక్స్ట్ నుంచి ఇమేజ్‌లు క్రియేట్ చేసుకోగల AI మోడల్ అయిన ఈముపై ఆధారపడి పని చేస్తాయి. మొదటి ఫీచర్ పేరు ఈము వీడియో. దీనితో క్యాప్షన్, ఫొటో లేదా ఇమేజ్‌ని ఇన్‌పుట్‌గా ఉపయోగించి నాలుగు సెకన్ల నిడివి గల షార్ట్ వీడియోలను జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో జనరేట్ అయ్యే ప్రతి వీడియో కూడా నాలుగు సెకన్ల వరకే ఉంటుంది. ఈ వీడియోల స్టైల్, కంటెంట్‌ను గైడ్ చేయడానికి యూజర్లు డిస్క్రిప్షన్ ప్రాంప్ట్‌ను కూడా అందించొచ్చు. రెండో ఫీచర్ ఈము ఎడిట్. దీనితో టెక్స్ట్ కమాండ్స్ ఉపయోగించి ఇప్పటికే ఉన్న వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు యూజర్లు వీడియోలోని ఆబ్జెక్ట్ కలర్, సైజు లేదా లొకేషన్ మార్చవచ్చు లేదా దానికి టెక్స్ట్ లేదా స్టిక్కర్‌లను జోడించవచ్చు. వీడియోలోని ఇతర అంశాలను ప్రభావితం చేయకుండా, యూజర్లు పేర్కొన్న మార్పులను మాత్రమే చేయడానికి ఈము ఎడిట్ స్పెసిఫికేషన్‌ను మెటా కంపెనీ పరిచయం చేసింది ఈ ఫీచర్లు డేటా నుంచి కొత్త కంటెంట్‌ను సృష్టించగల AI రంగం అయిన జనరేటివ్ AIని ముందుకు తీసుకెళ్లడానికి మెటా చేస్తున్న ప్రయత్నాల్లో భాగం. 2022లో జనరేటివ్ AI సూపర్ పాపులర్ అయ్యింది. ఇది చాలా పవర్‌ఫుల్ టెక్నాలజీ. ఓపెన్ఏఐ సంస్థ రియల్లిస్టిక్ కన్వర్జేషన్లను జనరేట్ చేయగల AI చాట్‌బాట్ చాట్‌జీపీటీ లాంచ్ చేశాక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత పాపులారిటీ దక్కించుకుంది.
మెటా నుండి ఈము వీడియో, ఈము ఎడిట్ ఫీచర్లు !
0
November 18, 2023
Tags