గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, గూగుల్ అకౌంట్ సైన్-అప్ పేజీలో పేరు, ఇమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్ వంటి బేసిక్ డీటైల్స్ ఎంటర్ చేయాలి. గూగుల్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత, బార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. బార్డ్, బ్రీఫ్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ద్వారా టీనేజర్‌లకు మార్గనిర్దేశం చేస్తుంది. చాట్‌బాట్ బాధ్యతాయుతమైన వినియోగాన్ని నొక్కి చెబుతుంది. బాధ్యతాయుత వినియోగంపై వీడియో, బార్డ్ యాక్టివిటీపై ఓవరవ్యూ అందిస్తుంది. ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత, టీనేజర్‌లు చాట్ చేయడానికి, ప్రశ్నలు అడగడానికి, టెక్స్ట్ జనరేట్ చేయడానికి బార్డ్‌ని ఉపయోగించవచ్చు. చాట్‌బాట్‌ను బార్డ్ వెబ్‌సైట్ లేదా డెడికేటెడ్ బార్డ్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. గూగుల్ వివిధ ఫీచర్ల ద్వారా అనుచితమైన కంటెంట్‌ను గుర్తించి నిరోధిస్తుంది. యంగ్ యూజర్లకు అనుచితమైన కంటెంట్‌ను ఫిల్టర్ చేయడానికి బార్డ్ శిక్షణ పొందింది, యువతకు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది. బార్డ్ సాధారణ సంభాషణకు మించి సేవలు అందిస్తుంది. ఇది యువతకు విలువైన లెర్నింగ్ టూల్‌గా ఉపయోగపడుతుంది. దీని ద్వారా యవత వివిధ అంశాలను లోతుగా పరిశోధించవచ్చు, కాంప్లెక్స్ టాపిక్స్‌ని బాగా అర్థం చేసుకోవచ్చు, కొత్త స్కిల్స్ ప్రాక్టీస్ చేయవచ్చు. న్యూ మ్యాథ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తోంది. మ్యాథ్ ఈక్వేషన్‌లకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లనేషన్ అందిస్తుంది. ఇంటరాక్టివ్ లెర్నింగ్‌ను ప్రోత్సహిస్తుంది. బార్డ్ సామర్థ్యాలు డేటా విజువలైజేషన్ వరకు విస్తరించాయి. టేబుల్స్ లేదా ప్రాంప్ట్‌లలో అందించిన డేటా ఆధారంగా చార్ట్‌లను రూపొందిస్తుంది. ఉదాహరణకు, బార్డ్‌ని కొన్ని నెలల్లో వాలంటీర్‌గా పనిచేసిన గంటలను వివరించే బార్ చార్ట్‌ను రూపొందించమని కోరవచ్చు. బార్డ్‌ని ఉపయోగించడానికి, ఆయా దేశాల్లో వయస్సు అర్హతలు మారవచ్చు. యూరోపియన్ ఎకనామిక్ ఏరియా, స్విట్జర్లాండ్, యూకేలో కనీస వయస్సు 18 ఉండాలి. ఇతర అందుబాటులో ఉన్న దేశాలలో 13 లేదా వారి ప్రాంతీయ నిబంధనల ప్రకారం నిర్దేశించిన వయస్సు అవసరం.
టీనేజర్లకు ఇన్నోవేటివ్ టూల్‌ని ఎక్స్‌ప్లోర్ చేసే అవకాశం !
0
November 18, 2023
ఓపెన్ఏఐ లాంచ్ చేసిన చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ కంపెనీ ఏఐ చాట్‌బాట్ బార్డ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలు క్రమంగా తమ చాట్‌బాట్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. తాజాగా గూగుల్ కంపెనీ, యూజర్లకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు బార్డ్‌ను ఎక్స్‌ప్యాండ్ చేసింది. ఈ ఇన్నోవేటివ్ టూల్‌ని ఎక్స్‌ప్లోర్ చేసే అవకాశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీనేజర్లకు కల్పించింది. ఏఐ చాట్‌బాట్ బార్డ్ ఇప్పుడు ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది, త్వరలో మరిన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గూగుల్ ప్రకారం యువత ఇన్‌స్పిరేషన్, కొత్త హాబీలు, రోజువారీ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి బార్డ్‌ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, క్లాస్ ప్రెసిడెంట్ స్పీచ్ కోసం టిప్స్ రాయమని బార్డ్‌ని అడగవచ్చు. ఏ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవాలో సూచించమని, కొత్త స్పోర్ట్ నేర్చుకునే మార్గాలు అందించమని కోరవచ్చు.
Tags