టాటా కంపెనీకి చెందిన క్రోమా దీపావళికి ‘‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ పేరుతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ మొదలు గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా టీవీలు, ల్యాప్‌టాప్స్, వాషింగ్ మెషిన్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ ఫోన్స్‌తో పాటు మరెన్నో వస్తువులపై డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్లు క్రోమా ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు, క్రోమా అధికారిక వెబ్‌సైట్, టాటా నూ యాప్‌లో నవంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్‌లో భాగంగా టీవీలపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. 55, 65, 75 ఇంచెస్‌తో కూడిన 4కే ఎల్‌ఈడీ టీవీలను నెలకు రూ. 2,990 ప్రారంభ ఈఎంఐ ఆప్షన్‌తో ప్రారంభమవుతుంది. 55 ఇంచెస్ సామ్‌సంగ్ లైఫ్‌స్టైల్ ఫ్రేమ్ టీవీని రూ. 2,990 ప్రారంభ ఈఎమ్‌ఐతో సొంతం చేసుకోవచ్చు. ఇక ల్యాప్‌టాప్‌లపై కూడా అదిరిపోయే డీల్స్ అందిస్తున్నారు. ఇంటెల్ కోర్ ఐ3తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లు రూ. 30,900 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లను 24 నెలల వరకు ఈఎంఐతో కొనుగోలు చేయొచ్చు. మాక్‌బుక్ ఎయిర్‌లు రూ. 49,500 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక నెలకు రూ. 2,299 ప్రారంభ ఈఎమ్‌ఐతో సొంతం చేసుకోవచ్చు. గృహోపకరణాల విషయానికొస్తే.. 256ఎల్ ఫాస్ట్ ఫ్రీ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్‌ను రూ. 22,990 నుంచి కన్వర్టబుల్ 256L రిఫ్రిజిరేటర్‌లు రూ. 28,990 ధర నుంచి ప్రారంభమవుతున్నాయి. వీటితో పాటు క్రోమాలో మరెన్నో ఎలక్ట్రానిక్స్‌పై ఈఎంఐ ఆప్షన్లు అందిస్తున్నారు. 8 కేజీల ఫుల్ ఆటోమేటిక్ టాప్‌లోడ్ వాషింగ్ మెషీన్‌ను నెలకు రూ. 1799 ఈఎంఐతో కొనుగోలు చేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్ ధరలు రూ. 999, 5జీ ఫోన్‌లు రూ. 13,499 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇక సౌండ్ బార్‌లపై కూడా భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. రూ. 10 వేల నుంచి అందుబాటులో ఉన్న సౌండ్ బార్‌లను రూ. 999 ప్రారంభ ఈఎమ్‌ఐతో సొంతం చేసుకోవచ్చు.
క్రోమా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ !
0
November 05, 2023
Tags