ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల కోసం ఓ కీలక ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పీచర్ ఇప్పటికే ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ కలిగి ఉంది. ఈ ఫీచర్ త్వరలో అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న ఫీచర్ ద్వారా యూజర్లు రీడ్ రిసీప్ట్‌ను హైడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటికే వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న మాదిరిగా మీకు ఇతరుల నుంచి వచ్చిన డైరెక్ట్ మెసేజ్‌లను మీరు చూసిన తర్వాత కూడా వారికి మీకు మెసెజ్‌లను చూసినట్లు తెలిసే అవకాశం ఉండదు. ఈ ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లుకు మరింత నియంత్రణ, భద్రత చేకూరే అవకాశం ఉంది. ఉదాహరణకు మీ ఇన్‌స్టా ఖాతాకు కొన్ని డెరెక్ట్ మెసెజ్‌లు వచ్చాయి. అయితే అప్పటికప్పుడు వాటికి స్పందించే సమయం మీకు లేదు, అయినా ఆ మెసేజ్‌లను చదివి తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు స్పందించే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ వాట్సాప్‌లో గోప్యత కోరుకొనే వినియోగదారులకు ఇప్పటికే ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్ సీఈవో మెస్సోరి వెల్లడించారు. అయితే ఫీచర్ ఇన్‌స్టా యూజర్లకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడించలేదు. కానీ రానున్న కొన్ని వారాల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే మెసెంజర్‌కు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ గోప్యతా ఫీచర్‌తోపాటు ఫోటోగ్రాఫ్, వీడియో కంటెంట్‌ను మరింత మెరుగుపరిచేందుకు అనేక కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు ఇన్‌స్టాగ్రామ్ పనిచేస్తోందని తెలుస్తోంది. దీంతోపాటు యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు AI ఫీచర్లను కూడా యూజర్ల కోసం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టా యూజర్లు తమ ప్రొఫైల్ ఫొటోగా షార్ట్ లూమ్ సినిమాలను వినియోగించే విధంగా మరో ఫీచర్‌ను కూడా త్వరలో విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్‌పై ఇన్‌స్టా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం యూజర్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచడం సహా ఫ్లాట్‌ఫాంకు మరింత మంది వినియోగదారులను తీసుకొచ్చే విధంగా పనిచేస్తుందని తెలుస్తోంది. మెటా నేతృత్వంలోనే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా వినియోగదారుల భద్రత మరియు గోప్యతను మెరుగుపరిచేందుకు అనేక ఫీచర్లను తీసుకొస్తుంది. చాట్ లాక్, పాస్‌కీస్, సహా వాట్సాప్ వెబ్ వెర్షన్ కోసం లాక్ స్క్రీన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతోపాటు మరిన్ని ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో రీడ్ రిసీప్ట్‌ను హైడ్ చేసుకొనే ఫీచర్ ?
0
November 08, 2023
Tags