Ad Code

పేటీఎం నుంచి బెర్క్‌షైర్ హాత్వే నిష్ర్కమణ !


డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్) నుంచి వారెన్ బఫెట్ ఆధ్వర్యంలోని బెర్క్‌షైర్ హాత్వే నిష్క్రమించింది. ఫిన్‌టెక్ మేజర్ పేటీఎంలో తన మొత్తం వాటాను సుమారు రూ. 1,370 కోట్లకు బహిరంగ మార్కెట్ ద్వారా విక్రయించింది. దాంతో రూ. 630 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్టు శుక్రవారం ఒక నివేదిక తెలిపింది. బెర్క్‌షైర్ హాత్‌వే ఇంక్ 1.56 కోట్లకు పైగా పేటీఎం షేర్లను బల్క్ డీల్‌లో విక్రయించింది. ఒక్కో షేరుకు సగటు ధర రూ. 877.29తో విక్రయించినట్టు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా తెలిపింది ప్రపంచంలోని అతిపెద్ద బిలియనీర్ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ పేటీఎం పేరంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్‌లో తన మొత్తం వాటాను విక్రయించింది. వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే ఐదేళ్ల క్రితం 2018లో పేటీఎంలో రూ.2200 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీని ద్వారా బఫెట్ పేటీఎంలో 2.6శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్ జరిగినప్పుడు, ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం విలువ 10 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. అయినప్పటికీ, పేటీఎంపై వారెన్ బఫెట్‌కు నష్టాన్ని కలిగించే ఒప్పందంగా మారింది. ఫలితంగా నష్టం రూ. 630 కోట్లుగా నమోదైంది. సెప్టెంబర్ 2023 నాటికి, ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎం వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌లో బెర్క్‌షైర్ బీహెచ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ 2.46శాతం వాటాను కలిగి ఉంది. బెర్క్‌షైర్ హాత్వే తన పెట్టుబడి పెట్టిన 5ఏళ్ల తర్వాత పేటీఎం నుంచి నిష్క్రమించింది. 2021లో పేటీఎంలో మెగా ఐపీఓ సందర్భంగా రూ. 220 కోట్ల విలువైన షేర్లను విక్రయించినట్లు నివేదిక శుక్రవారం నివేదించింది. పేటీఎం వన్ 97 కమ్యూనికేషన్స్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం.. బెర్క్‌షైర్ కంపెనీ 17,027,130 షేర్లను కొనుగోలు చేసింది. సగటు కొనుగోలు ఖర్చు ఒక్కో షేరుకు రూ. 1,279.70గా నమోదైంది. దీని తరువాత, బెర్క్‌షైర్ 2021 సంవత్సరంలో వన్97 కమ్యూనికేషన్స్ ఐపీఓ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించింది. ఇప్పుడు బెర్క్‌షైర్ హాత్వే, అసోసియేట్ బీహెచ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ద్వారా పేటీఎంలోని 15,623,529 షేర్లను ఒక్కో షేరుకు రూ. 877.2 చొప్పున విక్రయించింది.

Post a Comment

0 Comments

Close Menu