వర్చువల్ చాట్ సైట్ 'ఒమెగల్' ఈ రోజు షట్‌డౌన్ అయింది. ప్రస్తుతం ఈ సైట్‌ను యాక్సెస్ చేయాలని చూస్తే ఒక ఫోటో మాత్రమే కనిపిస్తోంది. ఇది 2009లో ప్రారంభించబడింది. ఆపరేటింగ్ సమస్యలు, పెరిగిన ఖర్చుల కారణంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు ఒమెగల్ ఫౌండర్ 'లీఫ్ కె-బ్రూక్స్' వెల్లడించాడు. మనకు ప్రస్తుతం కనిపించే ఫొటోలో సమాధి రాయి మీద బ్రాండ్ లోగో, దాని కింద 2009 - 2023 వంటివి చూడవచ్చు. లీఫ్ కె-బ్రూక్స్ 'ఒమెగల్' గురించి వివరిస్తూ కొత్త వ్యక్తులకు పరిచయ వేదికగా పనిచేసిన ఒమెగల్, 14 సంవత్సరాలు సేవలు అందిస్తూ వచ్చింది. యూజర్స్ భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఎన్నో అప్డేట్స్ తీసుకువచ్చినప్పటికీ కొందరు దీనిని స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు. 2023 జూన్ నాటికి ప్రతి రెండు రోజులకు ఒకసారి పిల్లలపై ఆన్‌లైన్ లైంగిక వేధింపులు వచ్చాయని, అలాంటి వాటికి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కొన్ని నియమాలు ప్రవేశపెట్టినట్లు బ్రూక్స్ వెల్లడించారు. అయితే ఒమెగల్ ఆన్‌లైన్ కమ్యూనికేషన్ సేవలపై జరిగిన దాడుల గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వీయ వ్యక్తీకరణ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకోవడం మాత్రమే కాకుండా నిర్వహణ, దీని దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒత్తిడి వంటి వాటితో పాటు ఆర్థిక భారాలు పెరగటం వల్ల 14 సంవత్సరాల తర్వాత ఈ ప్లాట్‌ఫామ్ నిర్వహణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు బ్రూక్స్ స్పష్టం చేశారు.
'ఒమెగల్' ఆన్‌లైన్ చాట్ సైట్ షట్‌డౌన్
0
November 09, 2023
Tags