డీప్ ఫేక్ వీడియోలను ఎలా గుర్తించాలి ?
Your Responsive Ads code (Google Ads)

డీప్ ఫేక్ వీడియోలను ఎలా గుర్తించాలి ?


ర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ డీప్‌ ఫేక్‌ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ ఇలాంటి వీడియోలను రూపొందిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే కొన్ని గుర్తుల కారణంగా ఈ ఫేక్ వీడియోలను గుర్తించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. డీప్‌ ఫేక్‌ వీడియోల్లో ఉండే మనుషుల కదలికలు అసహజంగా ఉంటాయి. సహజంగా కనురెప్పులు ఆడక పోవడం, ముఖ కవళికల్లో మార్పులు లేకపోవడం. సందర్భానికి అనుగుణంగా ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్‌ లేకపోయినా కూడా అది ఫేక్ అని గుర్తించాలి. ఇక వీడియోలో కనిపించే ముహాలు ఎబ్బెట్టుగా కనిపించినా సదరు వీడియో ఫేక్‌ వీడియో కావొచ్చు. ముక్కు, నోరు, కళ్లు అసహజంగా కనిపించినా, అలాగే శరీర కదలికలు, ముహం కదలికలు తేడాగా కనిపించినా అది కచ్చితంగా ఫేక్ వీడియోనే. వీడియోలో వినిపిస్తున్న వాయిస్ కు లిప్ సింక్ కు అస్సలు మ్యాచ్ అవ్వకుండా ఉంటాయి. ముఖం కదలికలు లేని వీడియోను ఫేక్ వీడియో గా నిర్దారణకు రావొచ్చు.. వీడియోలు నాణ్యత ఎక్కువగా ఉండవు. వీడియో పిక్సెల్స్‌ విడిపోయినట్లు మసక, మసకగా కనిపిస్తుంటుంది. అలాగే వీడియోను ఎవరు పోస్ట్ చేశారన్న విషయాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలి. వీడియోను పోస్ట్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఆ వీడియో రియాలా ఫేక్ అనేది చెప్పవచ్చు..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog