Ad Code

కోవిడ్, క్యాన్సర్ ను మూడు నిమిషాల్లో గుర్తించే పరికరం !


కోవిడ్, క్యాన్సర్ ను మూడు నిమిషాల్లో గుర్తించే పరికరాన్ని కనుగొన్నారు. మూడు నిమిషాల్లో కోవిడ్, క్యాన్సర్ ను కచ్చితంగా గుర్తించే చిన్న పాటి జన్యు పరీక్ష పరికరాన్ని యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కోవిడ్ టెస్ట్ గా ఈ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్ బాత్ ఇంజినీర్లు అభివర్ణించారు. ముక్కు ద్వారా సేకరించిన శాంపిల్ ను ల్యాబ్ ఆన్ ఏ చిప్ సాంకేతికత ద్వారా తక్కువ ఖర్చుతో ఈ పరికరంతో పరీక్షించి కోవిడ్ ఉందో లేదో నిర్ధారించవచ్చు. ఈ పరీక్ష ఫలితాన్ని స్మార్ట్ ఫోన్ యాప్ లో చూడవచ్చు. మురికి నీటిని ఈ పరికరంలో పరీక్షించి అందులో కోవిడ్ తదితర వ్యాధులు, ఇన్ఫెక్షన్లను వ్యాపింపచేసే వైరస్ లను గుర్తించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu