సుజుకి మోటార్ కార్పొరేషన్ ఈ ఏడాది నవంబర్ 7-12 వరకు మిలన్‌లో జరిగిన అతి పెద్ద మోటార్‌సైకిల్ షో EICMA 2023లో రెండు కొత్త మోటార్‌సైకిల్ మోడళ్లను ఆవిష్కరించింది. ఇందులో ఒకటి GSX-S1000GX. ఇదొక స్పోర్ట్-టూరర్, అడ్వెంచర్ బైక్‌ల ఫీచర్లు కలిపి అందించే ఓ క్రాస్ఓవర్ మోడల్. GSX-S1000GX మోటార్‌సైకిల్, GSX-S1000 సిరీస్‌లో అందించిన పవర్‌ఫుల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది స్పోర్ట్ రైడింగ్ కోసం ఎక్స్‌లెంట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. టాప్-నాచ్ టూరింగ్ కేపబిలిటీస్ కోసం కొత్త టెక్నాలజీ, డివైజ్‌లు కూడా ఆఫర్ చేస్తుంది. బైక్ అగ్రెసివ్ డిజైన్‌తో రావడమే కాక సుదూర ప్రయాణానికి సౌకర్యవంతమైన అప్‌రైట్ రైడింగ్ పొజిషన్‌ను కూడా అందిస్తుంది. GSX-S1000GX సుజుకి అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ (SAES)తో మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేయనుంది. ఈ టెక్నాలజీ వెహికల్ స్పీడ్, రోడ్డు కండిషన్స్ వంటి అంశాల ఆధారంగా సస్పెన్షన్ డంపింగ్, ప్రీలోడ్‌ను ఎలక్ట్రానిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. కంపెనీ సుజుకి రోడ్ అడాప్టివ్ స్టెబిలైజేషన్ (SRAS) సిస్టమ్ కూడా అభివృద్ధి చేసింది, ఇది చదునుగా లేని రహదారి ఉపరితలాలను గుర్తించి, తదనుగుణంగా సస్పెన్షన్ సెట్టింగ్స్‌ను మారుస్తుంది. ఈ SAES, SRAS కాంబినేషన్ కఠినమైన రోడ్లపై తక్కువ వైబ్రేషన్‌తో స్మూత్ జర్నీని అందిస్తుంది, అలాగే మంచి రోడ్లపై డైనమిక్ స్పోర్ట్ పర్ఫామెన్స్ ఆఫర్ చేస్తుంది. GSX-S1000GX పవర్ క్యారెక్టర్‌స్టిక్స్, ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్లు, SAES డంపింగ్ సెట్టింగ్స్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ కోసం SDMS సిస్టమ్ వంటి వివిధ ఎలక్ట్రానిక్ కంట్రోల్స్‌తో వస్తుంది. ఇది మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. కార్నర్స్‌లో లీన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ABSని యాక్టివేట్ చేయగలదు. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్లు GSX-S1000GXని అన్ని స్కిల్ లెవెల్స్ గల రైడర్లకు బెస్ట్ బైక్‌గా నిలుస్తుంది. GSX-8R అనేది అన్ని వయసుల, రైడర్‌ల కోసం సుజుకి తీసుకొస్తున్న కొత్త స్పోర్ట్స్ బైక్. GSX-8R బైక్‌ను పాపులర్ GSX-8S ఆధారంగా రూపొందించారు. ఇది స్పోర్ట్స్ రైడింగ్ కోసం ఫెయిరింగ్, డిఫరెంట్ హ్యాండిల్‌బార్స్‌ను అందజేస్తుంది. ఎక్స్‌పోస్డ్ ఇంజన్, సీట్ రైల్ సుజుకి స్పోర్ట్ బైక్ హెరిటేజ్‌ను ప్రదర్శిస్తుంది. GSX-8R 776 cm3 పారల్లెల్ 2-సిలిండర్ ఇంజన్‌తో మెరుగైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులో ఫిట్ ఫ్రేమ్, అలాగే పెద్ద పిస్టన్‌లతో కూడిన సస్పెన్షన్‌ను రైడర్లు పొందుతారు. GSX-S1000GX, GSX-8R రెండూ సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ (S.I.R.S.) ఫీచర్లతో వస్తాయి. GSX-S1000GX బైక్ SDMS-α సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది. ఈ సిస్టమ్ సస్పెన్షన్ డంపింగ్, ట్రాక్షన్ కంట్రోల్, పవర్ ఔట్‌పుట్ ఫీచర్స్‌పై ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ఆఫర్ చేస్తుంది. GSX-8Rలో సుజుకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (STCS) ఉంది, ఇది వీల్ స్పిన్ కనుగొనబడినప్పుడు పవర్ ఔట్‌పుట్‌ను పరిమితం చేస్తుంది. SDMS సిస్టమ్‌తో రైడర్ మూడు వేర్వేరు పవర్ ఔట్‌పుట్ ఆప్షన్స్ మధ్య నచ్చినదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కంపెనీ ప్రకారం GSX-S1000GX 2023, డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతుంది. GSX-8R 2024, జనవరిలో ప్రధానంగా యూరప్, ఉత్తర అమెరికాలో విడుదల అవుతుంది. నివేదికల ప్రకారం, కొత్త సుజుకి మోడల్‌ల ధర లాంచ్ సమయంలో తెలుస్తుంది.
సుజుకి బ్రాండ్ నుంచి కొత్త మోటార్ సైకిళ్లు !
0
November 11, 2023
Tags