Ad Code

బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌ !


కామర్స్‌ సైట్స్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ను భారత్‌లోనూ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అమెజాన్‌ సైతం బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో భాగంగా హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌ బడ్స్‌, ప్రొజెక్టర్స్‌తో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో భాగంగా ప్రముఖ రిటైలర్‌ క్రోమా భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌, హెడ్‌ఫోన్స్‌, టీవీలపై ఆఫర్లు అందిస్తున్నాయి. నవంబర్‌ 24 నుంచి 26 వరకు ఈ సేల్‌ను నిర్వహించనున్నారు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. వెయ్యి వరకు డిస్కౌంట్‌ లభించనుంది. యాపిల్‌ బ్రాండ్‌ సేల్స్‌కు పెట్టింది పేరైన ఇమాజిన్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో కూడా బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. యాపిల్ ఫోన్స్‌, ఐప్యాడ్‌, మాక్‌తో పాటు ఇతర యాపిల్‌ ప్రొడక్ట్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 5000 డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఇక ఎక్స్చేంజ్‌లో భాగంగా అదనంగా రూ. 10 వేలు డిస్కౌంట్‌ పొందొచ్చు. టాటా క్లిక్‌లో కూడా బ్లాక్‌ ఫ్రైడేలో భాగంగా భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. స్పీకర్స్‌, హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌ఫోన్స్‌పై ఐసీఐసీఐ, కొటాక్‌ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇక హెచ్‌అండ్‌ఎమ్‌లో 20 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నారు. విజయ్‌ సేల్స్‌లో కూడా బ్లాక్‌ ఫ్రైడేలో మంచి ఆఫర్స్‌ను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్లే స్టేషన్‌ 5 గేమింగ్ కన్సోల్‌తో పాటు టీవీలు, వాషింగ్‌ మిషిన్లు, రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. షాపర్‌స్టాప్‌ సైతం బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. క్లాతింగ్‌, మేకప్‌, స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌తో పాటు అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో 10 శాతం అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. జరా ఆన్‌లైన్‌ స్టోర్‌లోనూ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా క్లాతింగ్స్‌పై జరా యాప్‌లో కొనుగోలు చేస్తే ఏకంగా 40 డిస్కౌంట్‌ అందించనున్నారు. ఇక నైకాలో కూడా భారీగా డిస్కౌంట్స్‌ ఇస్తున్నారు. నవంబర్‌ 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లో ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu