Ad Code

ఓటీపీ మెసేజ్‌లను ఆటోమెటిక్‌గా డిలీట్ చేసే ఆప్షన్ !


ఆండ్రాయిడ్ డివైజ్‌లో గూగుల్ మెసేజెస్ ని డిఫాల్ట్ మెసేజింగ్ యాప్‌గా ఉపయోగిస్తున్న వారు ఆటోమేటిక్‌గా OTP మెసేజ్‌లు డిలీట్ చేసుకోవచ్చు. గూగుల్ మెసేజెస్ యాప్‌లో 24 గంటల తర్వాత OTPలను ఆటోమేటిక్‌గా డిలీట్ చేసే ఒక యూజ్‌ఫుల్ ఫీచర్ ఉంది. ఇది ఫోన్ ఇన్‌బాక్స్‌ను క్లీన్‌గా, ఆర్గనైజ్‌గా ఉంచుతుంది. యూజర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సమయం ఆదా చేస్తూ ఇది ఈ పని చేస్తుంది. మొదట  గూగుల్ మెసేజెస్ యాప్‌ ఓపెన్ చేసి, టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్ చేయాలి. 'మెసేజ్ సెట్టింగ్స్‌' సెలక్ట్ చేసి, 'జనరల్‌'పై క్లిక్ చేయాలి. మెసేజ్ ఆర్గనైజేషన్ కింద, "ఆటో-డిలీట్ OTPs ఆఫ్టర్ 24 అవర్స్" అనే ఆప్షన్ కనిపిస్తుంది. టోగుల్‌ రైట్ సైడ్‌కి వచ్చేలా స్లైడ్ చేసి, ద్వారా దాన్ని ఆన్ చేయాలి. అంతే, OTPల కోసం ఆటో-డిలీట్ ఫీచర్‌ సక్సెస్‌ఫుల్‌గా ఎనేబుల్ అవుతుంది. ఈ ఫీచర్ ఆన్ అయ్యాక వచ్చే ఏవైనా OTP మెసేజ్‌లు 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. కాబట్టి వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ డివైజ్‌లో గూగుల్ మెసేజెస్ యాప్ లేకపోతే, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇన్‌స్టాల్ చేశాక డిఫాల్ట్ మెసేజింగ్ యాప్‌గా మార్చుకోవాలి. మొదట డివైజ్ సెట్టింగ్స్‌కు వెళ్లి, "అప్లికేషన్స్" ఆప్షన్‌పై నొక్కాలి. చూజ్ డిఫాల్ట్ యాప్స్‌పై క్లిక్ చేసి, "SMS యాప్‌"పై నొక్కాలి. డిఫాల్ట్ SMS యాప్‌గా "గూగుల్ మెసేజెస్" సెలెక్ట్ చేసుకోవాలి.

Post a Comment

0 Comments

Close Menu