గూగుల్ క్రోమ్ తాజాగా ఈ బ్రౌజర్ ఐఫోన్ యూజర్లు స్క్రీన్ పైభాగంలో కనిపించే అడ్రస్ బార్ ను ఎక్కడ ఉంచాలనేది ఇప్పుడు యూజర్లు సెలక్ట్ చేసుకోవచ్చని తెలిపింది. యూజర్లు దీన్ని ఎప్పటిలాగే పైనే ఉంచవచ్చు, లేదంటే కిందకు మూవ్ చేయవచ్చు. అడ్రస్ బార్‌ను బాటమ్‌కు తెచ్చుకోవడం ద్వారా చాలా సులభంగా సౌకర్యవంతంగా వన్ హ్యాండ్ బ్రౌజింగ్ చేయవచ్చు. గత ఏడాది సఫారి బ్రౌజర్‌లో యాపిల్ ఈ ఫీచర్‌ను పొందింది. చాలా మంది క్రోమ్ యూజర్లు ఈ ఆప్షన్‌ని కోరిన తర్వాత గూగుల్ కూడా ఈ ఎంపికను జోడించాలని నిర్ణయించుకుంది. అడ్రస్ బార్ లొకేషన్‌ను మార్చడానికి, యూజర్లకు రెండు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మొదటి ఆప్షన్‌లో అడ్రస్ బార్‌పై లాంగ్ ప్రెస్ చేసి "మూవ్ అడ్రస్ బార్ టు ది బాటమ్" అని సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండో ఆప్షన్‌లో టాప్ లేదా బాటమ్ మధ్య మారడానికి సెట్టింగ్స్ మెనూకి వెళ్లి, "అడ్రస్ బార్"పై నొక్కాలి. ఈ సంవత్సరం ప్రారంభంలో బీటా వెర్షన్‌లో టెస్ట్ చేశాక ఈ ఫీచర్‌ను ఇప్పుడు iOS వినియోగదారులందరికీ క్రోమ్ బ్రౌజర్ అందుబాటులోకి తెచ్చింది. ఇది అందుబాటులోకి వచ్చినవారు అడ్రస్ URL బార్ ప్లేస్‌మెంట్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్, సెర్చ్, క్రోమ్ వంటి ప్రొడక్ట్స్‌ను అందరికీ ఉపయోగపడేలా చేయడానికి కృషి చేస్తోంది. ఇది ఇటీవల మ్యాప్స్, సెర్చ్, క్రోమ్ కోసం కొన్ని కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫీచర్లలో ఒకటి గూగుల్ మ్యాప్స్, సెర్చ్‌లో అందించిన ఐడెంటిటీ అట్రిబ్యూట్. వైకల్యాలు ఉన్నవారి కోసం ఈ కొత్త ఫీచర్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో వ్యాపారాలు వికలాంగుల యాజమాన్యంలో ఉన్నాయని లేదా రన్ అవుతున్నాయని లేదా అవి డిజేబులిటీస్ ఉన్న వ్యక్తుల కోసం ప్రొడక్ట్స్/సర్వీసెస్ అందిస్తున్నాయని సూచించగలవు. కస్టమర్లు ఈ వ్యాపారాల గురించి మరింత సమాచారాన్ని కనుగొనడంలో, వారికి మద్దతు ఇవ్వడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. మరొక ఫీచర్ మ్యాప్స్‌లో లెన్స్, దీనిని గతంలో 'సెర్చ్ విత్ లైవ్ వ్యూ'గా పిలిచేవారు. ఈ ఫీచర్ ఫోన్ కెమెరాతో కొత్త ప్రదేశాలను అన్వేషించడంలో యూజర్లకు సహాయపడటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీని ఉపయోగిస్తుంది. చుట్టూ తిరిగేటప్పుడు డైరెక్షన్స్, ల్యాండ్‌మార్క్‌లు, రివ్యూలు, ఇతర సమాచారాన్ని స్క్రీన్‌పై డిస్‌ప్లే చేస్తుంది. ఈ ఫీచర్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, అంధత్వం లేదా తక్కువ దృష్టి ఉన్న వ్యక్తులకు ఉపయోగకరంగా చేయడానికి, గూగుల్ మ్యాప్స్‌లోని లెన్స్‌కి స్క్రీన్ రీడర్ స్పెసిఫికేషన్‌ను జోడిస్తోంది. ఈ కొత్త స్పెసిఫికేషన్‌తో వినియోగదారులు స్క్రీన్‌పై చూసే వాటి ఆడియో డిస్క్రిప్షన్స్ వినవచ్చు. ఈ ఫీచర్ మంగళవారం నుంచి iOSలో, ఈ సంవత్సరం తరువాత ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంటుంది.
ఐఓఎస్ యూజర్లకు గూగుల్ క్రోమ్ గుడ్‌న్యూస్ !
0
November 01, 2023
Tags