Ad Code

హోసూరు ప్లాంట్‌ విస్తరణ దిశగా టాటా గ్రూప్ ?


ఫోన్‌ల కోసం కేసింగ్‌లను తయారు చేసే హోసూరు ప్లాంట్‌ను విస్తరణలో భాగంగా రెట్టింపు చేయాలని టాటా ఎలక్ట్రానిక్స్ భావిస్తోంది. వచ్చే 12-18 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. ప్లాంట్‌లో శ్రామిక శక్తి ప్రస్తుతం 15,000గా ఉంది. అయితే దీన్ని 28,000కు పెంచాలని భావిస్తోంది. కర్ణాటకలో విస్ట్రోన్ ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్‌ను టాటా గ్రూప్ ఇటీవల కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రీమియం ఎలక్ట్రానిక్ పరికరాలు, ఉపకరణాల కోసం కాంట్రాక్ట్ తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి వ్యూహాత్మకంగా ఈ ప్లాంట్‌ను చేజిక్కించుకుంది. టాటా గ్రూప్ రూ.5000 కోట్ల పెట్టుబడితో హోసూరు ప్లాంట్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇది సుమారు 500 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. 15 వేలకు పైగా ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. ప్రతిపాదిత ప్లాంట్ విస్తరణ వచ్చే 12-18 నెలల్లో జరగనుంది. ఈ ఏకీకృత సైట్‌లో ఉద్యోగుల పెరుగుదల దాదాపు 25,000 నుంచి 28,000 వరకు ఉండవచ్చు. ప్లాంట్ ప్రస్తుత పరిమాణం, సామర్థ్యం కంటే అదనంగా 1.5- 2 రెట్లు విస్తరించే అవకాశం ఉంది. విస్తరణ తరువాత ప్రధానంగా యాపిల్ ఫోన్‌ల భాగాల తయారీపై కంపెనీ దృష్టి సారించవచ్చు. యాపిల్ కంపెనీ తన ఐఫోన్స్ తయారీ యూనిట్‌ను చైనా నుంచి పూర్తిస్థాయిలో తరలించాలని ఎప్పటి నుంచో అనుకుంటోంది. ప్రత్యామ్నాయ వేదికగా భారత్‌ను ఎంచుకుంది. ఈ క్రమంలో వెండార్‌గా టాటా ఎలక్ట్రానిక్స్‌ను యాపిల్ కంపెనీ షార్ట్ లిస్ట్ చేసింది. దీంతో టాటా ఎలక్ట్రానిక్స్ ఐఫోన్ల విడి భాగాల తయారీకి హోసూరు ప్లాంట్‌ను విస్తరించాలనుకుంటోంది. ఈ విస్తరణ భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ తయారీ రంగం మరింతగా వృద్ధి చెందుతుంది. అదే సమయంలో యాపిల్ కంపెనీతో విస్తృతమైన వ్యూహంతో వ్యాపారం మందుకు సాగుతుంది.

Post a Comment

0 Comments

Close Menu