Ad Code

టెక్ మహీంద్రా నుంచి వైదొలగనున్న సీపీ గుర్నానీ !


టెక్ మహీంద్రా నుంచి సంస్థ సీఈఓ కం ఎండీ సీపీ గుర్నానీ వైదొలుగుతున్నారు. వచ్చేనెల 19న సంస్థ ఎండీ కం సీఈఓగా, 21న డైరెక్టర్ గా వైదొలుగుతున్నారని రెగ్యులేటరీ ఫైలింగ్ లో టెక్ మహీంద్రా తెలిపింది. దానికి రెండు రోజుల ముందు డిసెంబర్ 19న టెక్ మహీంద్రా ఎండీ కం సీఈఓగానూ రిటైర్ అవుతారని పేర్కొంది. సీపీ గుర్నానీతోపాటు కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా విజయ్ కుమార్ కూడా తప్పుకుంటారు. విజయ్ కుమార్ వయస్సు 65 ఏండ్లకు చేరుకోవడంతో ఆయన నామినేషన్‌ను భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఉపసంహరించుకోవడంతో విజయ్ కుమార్ వైదొలుగుతున్నారు. '2004 నుంచి మహీంద్రా గ్రూపుతో అనుబంధం కలిగి ఉండటం ప్రివిలేజ్‌గా భావిస్తున్నా. 2020 ఏప్రిల్ నుంచి కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా వివిధ స్థాయిల్లో పని చేశాను' అని సీపీ గుర్నానీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 'నేను బోర్డులో మూడేండ్లకు పైగా పని చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజ్మెంట్ టీం, బోర్డు సభ్యులతో కలిసి పని చేసినందుకు గర్వంగా ఉంది' అని తెలిపారు. 'మహీంద్రా గ్రూపు డైరెక్టర్ గా పని చేసినంత కాలం యాజమాన్యం నుంచి పూర్తి మద్దతు లభించింది. నాకు మద్దతు తెలిపినందుకు బోర్డుకు, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నా' అని వెల్లడించారు. కంపెనీ డైరెక్టర్ గా వైదొలిగినా తదుపరి నాయకత్వానికి మార్గదర్శకత్వం వహిస్తానని సీపీ గుర్నానీ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu