వన్ ప్లస్ ఏఐ మ్యూజిక్ స్టూడియో !
Your Responsive Ads code (Google Ads)

వన్ ప్లస్ ఏఐ మ్యూజిక్ స్టూడియో !


వన్ ప్లస్ కొత్త వన్ ప్లస్ ఏఐ మ్యూజిక్ స్టూడియోను తీసుకు వచ్చింది. ఈ కొత్త టూల్ యూజర్లకు ఎల్లలు లేని మ్యూజిక్ వీడియోలను క్రియేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ కొత్త వన్ ప్లస్ AI మ్యూజిక్ స్టూడియో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి AI ఆధారిత బీట్స్ ను క్రియేట్ చేస్తుంది. అంతేకాదు, మీరు క్రియేట్ చేసిన మ్యూజిక్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు వన్ ప్లస్ కాంటెస్ట్ కోసం కూడా పంపించవచ్చు. వన్ ప్లస్ AI మ్యూజిక్ స్టూడియో అనేది వన్ ప్లస్ కొత్తగా తీసుకు వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మ్యూజిక్ ప్లాట్ ఫామ్. ఇందులో చాలా సింపుల్ గా లిరిక్స్ మరియు దానికి తగిన బీట్స్ తో AI మ్యూజిక్ వీడియోను క్రియేట్ చేయవచ్చు.వన్ ప్లస్ AI మ్యూజిక్ స్టూడియోలో వీడియో ఎలా క్రియేట్ చేయడం కోసం ముందుగా  ఇందులో అకౌంట్ క్రియేట్ చెయ్యాలి. ఇందుకోసం, aimusicstudio.oneplus.in సైట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మీ Sign In పైన క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి సబ్ మీట్ చెయ్యాలి. మీకు ఒక OTP అందుకుంటుంది మరియు దాన్ని ఎంటర్ చేయడం ద్వారా మీరు లాగిన్ అవ్వవచ్చు. ఇక్కడ SignUP పైన క్లిక్ చేసి అకౌంట్ ను క్రియేట్ చేయవచ్చు. సైన్ అప్ పైన క్లిక్ చేయగానే కొత్త పేజ్ లో మీ పేరు మరియు ఇమెయిల్ అడ్రెస్ వివరాలను అందించాలి. మీఋ అందించిన ఇమెయిల్ అడ్రెస్ కు OTP అందుతుంది. ఈ OTP ని ఎంటర్ చెయ్యగానే మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. వన్ ప్లస్ AI మ్యూజిక్ స్టూడియో లాగిన్ అయిన తరువాత, Create Music ద్వారా కొత్త మ్యూజిక్ క్రియేట్ కోసం ముందు సాగవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన genre, mood మరియు theme లను ఎంచుకోండి మరియు అడిగిన బాక్స్ లో మీ లిరిక్స్ కోసం ప్రాంప్ట్ ను అందించండి. అంతే, అడుగున ఉన్న proceed బటన్ ను నొక్కగానే 'Generated Lyrics based on your choices' అని మీ మ్యూజిక్ కోసం లిరిక్స్ ను అందిస్తుంది. పైన చూపిన లిరిక్స్ నచినట్లయితే క్రింద ఉన్న proceed బటన్ ను నొక్కగానే మీ మ్యూజిక్ వీడియో రెడీ అయిపోతుంది. మీరు ఈ వీడియోను Publish కూడా చేసే వీలుంది మరియు డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ కొత్త టూల్ లాంచ్ సందర్భంగా కాంటెస్ట్ ను కూడా వన్ ప్లస్ నిర్వహిస్తోంది. వన్ ప్లస్ యూజర్లు అందరికి ఈ కాంటెస్ట్ లో ప్రవేశం ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog