Ad Code

యమహా ఎఫ్‌జెడ్, ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్ మోడళ్లపై ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్స్!


దీపావళి పండుగ సందర్భంగా యమహా మోటార్ ఇండియా కంపెనీ 149సీసీ ఎఫ్‌జెడ్ మోడల్ రేంజ్, 125సీసీ ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్‌లపై ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది. ఎఫ్‌జెడ్-ఎక్స్, ఎఫ్‌జెడ్‌యస్-వి3 ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్‌యస్-వి4 ఎఫ్ఐ, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, రేజెడ్‌ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ వంటి మోడళ్లపై ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తోంది. ఆఫర్‌లలో ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌లు, తక్కువ డౌన్ పేమెంట్, ఫైనాన్స్ స్కీమ్‌లు ఉన్నాయి. ఎఫ్‌జెడ్-ఎక్స్‌పై రూ. 5వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్. ఎఫ్‌జెడ్ఎస్-వి3 ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్‌యస్-వి4 ఎఫ్ఐపై రూ. 3వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్. ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, రేజెడ్‌ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్‌పై రూ. 3వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్. ఎఫ్‌జెడ్-ఎక్స్ ధర రూ. 1,36,200, రూ. 1,37,200, ఎఫ్‌జెడ్‌యస్-వి3 ఎఫ్ఐ రూ. 1,21,400, రూ. 1,22,400 మధ్య ఉంది. ఎఫ్‌జెడ్‌యస్-వి4 ఎఫ్ఐ ధర రూ. 1,28,900. స్కూటర్లలో, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ రూ. 79,600, రూ. 93,330 మధ్య రేజెడ్‌ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ రూ. 84,730, రూ. 92,330 మధ్య ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ లొకేషన్‌కు సంబంధించినవి గమనించాలి. యమహా ప్రస్తుత ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో వైజెడ్‌ఎఫ్-ఆర్15 వి4 (155సీసీ), వైజెడ్ఎఫ్-ఆర్15S వి3 (155సీసీ), ఎంటీ-15 వి2 (155సీసీ); ఎఫ్‌జెడ్-ఎక్స్ (149సీసీ), ఎఫ్‌జెడ్-ఎఫ్ఐ (149సీసీ), ఎఫ్‌జెడ్‌యస్-ఎఫ్ఐ వెర్షన్ 3.0 (149సీసీ), ఎఫ్‌జెడ్‌యస్-ఎఫ్ఐ వెర్షన్ 4.0 (149సీసీ), ఏరోక్స్ 155 (155సీసీ), ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (125సీసీ), రే జెడ్‌ఆర్ఆర్ వంటి స్కూటర్లు 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (125సీసీ) రే జెడ్‌ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ (125సీసీ) ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu