Ad Code

ఉద్యోగులకు కార్లు గిఫ్టులుగా ఇచ్చిన ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని !


ర్యానాలోని ఓ కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ గిఫ్టులను అందించింది. దీపావళి కానుకగా కార్లను ఇచ్చింది. పంచకులలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని ఎంకే భాటియా తన ఉద్యోగులను సెలబ్రిటీలుగా పేర్కొంటూ 12 మంది స్టార్ పెర్ఫార్మర్స్‌కి కార్లను బహూకరించాడు. ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్ హెల్త్ కేర్, సమీప భవిష్యత్తులో మరో 38 మంది ఉద్యోగులకు కార్లను అందించాలని యోచిస్తోంది. ఈ దీపావళి బహుమతి అందుకున్న వారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉన్నారు. తన కంపెనీ విజయానికి ఉద్యోగుల కఠిన శ్రమ, అంకితభావం, విధేయత కారణమని పేర్కొన్నారు. వీరిలో కొందరు కంపెనీ ప్రారంభం నుంచి ఆయన వెంటే ఉన్నారు. ఈ కార్లు కేవలం దీపావళి కానుకలే కాదని, కంపెనీపై వారికి ఉన్న అచంచలమైన నిబద్ధత, విశ్వాసానికి రివార్డులని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గిఫ్టుగా కారు అందుకున్న వారిలో కొందరికి డ్రైవింగ్ కూడా రాదట. ఇలాంటి గిఫ్టులను తాము కలలో కూడా ఊహించలేదని ఉద్యోగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu