Ad Code

మోసాలను అరికట్టేందుకు భారీ సంఖ్యలో ఫోన్‌ నంబర్ల బ్లాక్ !


సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్ స్కామ్‌లో భాగస్వామ్యమైన సుమారు 70 లక్షల ఫోన్‌ నంబర్లను భారత్‌ ప్రభుత్వం బ్లాక్‌ చేసింది. ఈ తరహా మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొబైల్‌ IMEI నంబర్‌ను బ్లాక్‌ చేయడం, ఆ ఫోన్‌ నంబర్‌తో జతచేయబడి ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి నగదును ఉపసంహరించుకొనే పరిమితులు విధించింది. భవిష్యత్‌లో ఇలాంటి కార్యకలాపాల్లో భాగస్వామ్యం కాకుండా ఉండడం సహా దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి. ఇటీవల ఆర్‌బీఐ, ట్రాయ్‌, NPCI మరియు ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులతో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్‌ జోషి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు రకాల బ్యాంకు ఖాతాలను హైలెట్‌ చేశారు. ఈ ఖాతాల్లో తక్కువ నగదు నిల్వలతో కొనసాగుతాయి. అయితే అకస్మాత్తుగా నగదు బదిలీలు పెరుగుతాయని తెలిపారు. భవిష్యత్‌లో సైబర్ నేరాలను కట్టడి చేసే వ్యుహంలో భాగంగా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జనవరిలో మరోసారి భేటీ : డిజిటల్ ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా సుమారు సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాల్లో భాగస్వామ్యం అవుతున్న 7 మిలియన్ మొబైల్‌ నంబర్లును డియాక్టివేట్‌ చేశారు. జనవరిలో ఇదే తరహా మీటింగ్‌ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్వహించినట్లు తెలిసింది. స్విమ్‌ స్వాపింగ్‌లో సైబర్ నేరగాళ్లు మీ మొబైల్‌ నంబర్‌ను కొత్త సిమ్‌ కార్డుకు మార్చమని సలహా ఇస్తారు. అనంతరం ఫోన్ నంబర్‌ను పూర్తిగా వారి నియంత్రణలోకి తీసుకుంటారు. దాంతో ఆ నంబర్‌తో అనుసంధానం చేయబడిన బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అందువల్ల పిన్ లేదా పాస్‌వర్డ్‌ను ఏర్పాటుచేసుకోవాలి. బ్యాంక్‌, ప్రభుత్వ సంస్థలు, ఇతర ప్రముఖ సంస్థల పేర్లతో కొన్ని లింక్స్‌ను నేరగాళ్లు ఫోన్లకు పంపుతుంటారు. అలాంటి లింక్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి లింక్స్‌పైన క్లిక్‌ చేయడం ద్వారా వ్యక్తిగత లేదా సున్నితమైన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సరైన ధ్రువీకరణ లేకుండా ఎటువంటి వివరాలు వెల్లడించకూడదు. వాట్సాప్‌ ద్వారాను ఇటీవల కాలంలో ఎక్కువగా మోసాలు చేస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా పంపిన లింక్‌ను క్లిక్‌ చేయమని, అందులో వివరాలు నమోదు చేయాలని కోరవచ్చు. అలాంటి మెసేజ్‌, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. పూర్తి వివరాలు తెలుసుకున్నాక, వాటిని నిర్ధారించుకున్నాక.. అప్పుడు మాత్రమే స్పందించండి. ఎల్లప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచుకోవాలి. మెసేజ్‌, కాల్‌ లేదా ఇతర మార్గాల ద్వారా పిన్ లేదా పాస్‌వర్డ్‌లను షేర్ చేయకూడదు. దాంతోపాటు సోషల్‌ మీడియాలో షేర్ చేసిన సమాచారం ఆధారంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. బ్యాంక్‌ సహా ఇతర ఖాతాలను పర్యవేక్షించాలి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలి. ఇలాంటి ఘటనలతో వెంటనే నష్టం జరగకున్నా.. తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments

Close Menu