అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 సేల్‌లో భాగంగా అమెజాన్‌లో ఎక్స్ఛేంజ్, భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి హోమ్ డివైజ్‌ల వరకు, ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి హెల్మెట్ల వరకూ అన్ని వస్తువులూ ఇందులో ఉన్నాయి. ఈ సేల్‌లో బైక్ రైడింగ్‌లో ఎంతో ముఖ్యమైన బ్రాండెడ్ హెల్మెట్లను తక్కువ ధరకే అందిస్తోంది. వేగా క్రక్స్ ISI సర్టిఫైడ్ ఫ్లిప్ అప్ హెల్మెట్ మెటాలిక్ క్విక్ రిలీజ్ సైలెంట్ బకిల్‌ను కలిగి ఉంది. చిన్ గార్డ్‌ను అటు ఇటు తిప్పడానికి అనుకూలంగా ఉంటుంది. దీనిని సింగిల్ లివర్ ఫ్లిప్-అప్ మెకానిజంతో ఆపరేట్ చేయవచ్చు. లైనింగ్‌ని సులభంగా బయటకు తీసి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. షెల్‌ను మన్నికైన ABS మెటీరియల్‌తో తయారు చేశారు. ఈ హెల్మెట్‌ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా కేవలం 1,220 రూపాయలకు పొందవచ్చు. స్టుడ్స్ మార్షల్ ఓపెన్ ఫేస్ ఎల్మెట్ పాలియురేతేన్ అండ్ థర్మోప్లాస్టిక్ పదార్థాలతో ఈ హెల్మెట్‌ను రూపొందించారు. షెల్ అదనపు రక్షణ కోసం EPS/థర్మోప్లాస్టిక్‌ను ఉపయోగించారు. పురుషులు, మహిళలు, యువతకు అనుకూలంగా ఉంటుంది. ఈ హెల్మెట్‌పై ఒక సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది. దీనిని 11 వందల రూపాయలకు పొందవచ్చు. స్టీల్‌బర్డ్ sb 50 అడోనిస్ ఫుల్ ఫేస్ హెల్మెట్ ను ఈ హెల్మెట్‌ను డైనమిక్ వెంటిలేషన్ సిస్టమ్‌తో రూపొందించారు. దీని వల్ల సేఫ్ అండ్ సెక్యూర్‌గా బండిని డ్రైవ్ చేయవచ్చు. లోపలి షెల్‌ను అధిక సాంద్రత కలిగిన పాలీస్టైరిన్, కాటన్ ఫాబ్రిక్ ఇంటీరియర్‌తో తయారు చేశారు. ఈ హెల్మెట్ నియంత్రిత సాంద్రత కలిగిన EPS కంకషన్ ప్యాడింగ్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది ప్రత్యేకంగా యాంటీ-అలెర్జిక్ వెల్వెటీన్‌తో కప్పబడి ఉంటుంది. దీనిని 847 రూపాయలకు పొందవచ్చు.
సూపర్ హెల్మెట్స్ పై డిస్కౌంట్ ఆఫర్ !
0
November 03, 2023
Tags