Ad Code

త్వరలో యాపిల్ 'ఐప్యాడ్ ఎయిర్' లాంచ్ !


యాపిల్ కంపెనీ ఈ సంవత్సరం రెండు లాంచింగ్ ఈవెంట్లను నిర్వహించింది. ముందు ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇటీవల జరిగిన మరో ప్రోగ్రామ్‌లో కంపెనీ కొత్త, అప్‌గ్రేడెడ్ మ్యాక్‌బుక్స్, ఐమ్యాక్స్ రిలీజ్ చేసింది. కానీ యాపిల్ ఈ సంవత్సరం అప్‌డేట్ చేసిన ఐప్యాడ్ మోడల్‌ను లాంచ్ చేయలేదు. అయితే ఈ బ్రాండ్ వచ్చే ఏడాది మొత్తం ఐప్యాడ్ లైనప్‌ను రిఫ్రెష్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఐప్యాడ్ ఎయిర్‌కి సంబంధించిన కొత్త వార్త ఒకటి గాడ్జెట్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. అదేంటంటే.. యాపిల్ 2024లో ఐప్యాడ్ ఎయిర్‌ 12.9-అంగుళాల మోడల్‌ను రిలీజ్ చేయనుంది. ప్రస్తుత 10.9-అంగుళాల వేరియంట్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రిలీజ్ కానుంది. కొత్త ఐప్యాడ్ ఎయిర్‌కు సంబంధించిన వివరాలను యాపిల్ ఎనలిస్ట్ మింగ్-చి కువో వెల్లడించారు. యాపిల్ ప్రస్తుత అవుట్‌గోయింగ్ ఐప్యాడ్ ఎయిర్‌కు పెద్ద వెర్షన్‌ను 2024లో తీసుకువస్తుందని కువో విశ్లేషించారు. ఇది నెక్స్ట్ జనరేషన్ చిప్‌సెట్‌తో అప్‌డేట్ చేసిన 10.9-అంగుళాల మోడల్‌తో పాటు లాంచ్ అవుతుందని చెప్పారు. ఈ మోడళ్ల ఉత్పత్తి వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రోలో అందించిన మినీ LED డిస్‌ప్లే టెక్నాలజీ ఉండదని మింగ్-చి కువో పేర్కొన్నారు. దీనికి బదులుగా కంపెనీ కొత్త ప్రొడక్ట్‌ను LCD డిస్ప్లేతో అందిస్తుందని చెప్పారు. అయినా కూడా ఇది 10.9-అంగుళాల మోడల్ కంటే బెటర్ వెర్షన్‌గా నిలవనుంది. ఎందుకంటే ఇది ఐప్యాడ్ ప్రో 12.9-అంగుళాల మోడల్ మాదిరిగానే ఆక్సైడ్ బ్యాక్‌ప్లేట్‌తో వస్తుంది. వీటిలో a-Si బ్యాక్‌ప్లేట్ ఉండదు. 2024 మొదటి త్రైమాసికం చివరిలో లేదా రెండవ త్రైమాసికంలో యాపిల్ కొత్త OLED ఐప్యాడ్ ప్రో మోడళ్లను లాంచ్ చేస్తుందని కుయో చెప్పారు. ఈ OLED మోడల్స్, తాజా M3 చిప్‌సెట్‌తో వస్తాయని భావిస్తున్నారు. కంపెనీ ఈ ప్రాసెసర్‌ను గత నెలలో నిర్వహించిన 'స్కేరీ ఫాస్ట్' ఈవెంట్ సందర్భంగా పరిచయం చేసింది. OLED ఐప్యాడ్ ప్రో వేరియంట్లు M3 ప్రాసెసర్‌తో, మెరుగైన ఫారమ్ ఫ్యాక్టర్ డిజైన్‌తో వస్తాయని విశ్లేషించారు.



Post a Comment

0 Comments

Close Menu