Ad Code

హైదరాబాద్, బెంగళూరు ఆస్తులను అమ్మే ఆలోచనలో విప్రో ?


బెంగళూరు, హైదరాబాద్‌లోని రెండు కార్యాలయ ఆస్తులను నాన్-కోర్ రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి విప్రో విక్రయిస్తోంది. ఈ ఆస్తులలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి మరియు బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని క్యాంపస్‌ల భాగాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో ఉద్యోగాల్లో కోతతో పాటుగా, ఆస్తులను సైతం విక్రయించాలని విప్రో యోచిస్తోంది. గచ్చిబౌలి విప్రో క్యాంపస్‌ దాదాపు 14 ఎకరాలమేర విస్తరించి ఉంది. బెంగళూరులో 25 ఎకరాల భూమిని కలిగి ఉంది. అయితే కంపెనీ ఆ భూమిని పూర్తిగా లేదా కొంతమేరకే విక్రయిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. బెంగళూరు క్యాంపస్‌ను దశల వారీగా అమ్మనున్నట్లు సమాచారం. మొదటి దశలో ఐదు ఎకరాలు విక్రయిస్తుందని తెలిసింది.అయితే కంపెనీ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. హైదరాబాదులో విప్రోకు మొత్తం మూడు ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెండు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉండగా, ఒకటి మణికొండలో ఉంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 20 ఏళ్ల క్రితం కంపెనీకి భూమి కేటాయించింది.

Post a Comment

0 Comments

Close Menu