Ad Code

పిగ్ బచ్చరింగ్ స్కామ్ ఎలా జరుగుతుంది ?


సైబర్ నేరగాళ్లు ఈజీగా డబ్బులను దోచుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో ఎన్నో రకాల స్కామ్ లు వెలుగులోకి వస్తున్నాయి.. అలా వచ్చిందే పిగ్ బచ్చరింగ్ స్కామ్. నకిలీ జాబ్ ఆఫర్ స్కామ్ లు, నకిలీ క్రిప్టో పెట్టుబడులు, అధిక పెట్టుబడి స్కీమ్ ల వంటి వాటిని అమలు చేయబడిన వివిధ స్కామ్ లకు విస్తృత పదం. భారత్ లో పిగ్ బట్చరింగ్ స్కామ్ లో పదివేల కోట్ల వరకు మోసాలు జరిగాయి. ఫేక్ జాబ్ ఆఫర్ స్కామ్ లు, స్కామ్మీ హై రిటర్న్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ లు, క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ మెంట్లు వంటి జరుగుతున్నాయి. ఫేక్ ప్రొఫైల్ ద్వారా జనాలతో ముందుగా పరిచయాన్ని పెంచుకుంటారు.. వారితో స్నేహాన్ని కొనసాగిస్తారు.. మాటలు కలిపి ప్రేమలు వలక పోస్తారు.. వాళ్లు అనుకున్న పని అవ్వగానే అడ్రెస్ లేకుండా పోతారు.. ఈ స్కామ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది. నిజానికి ఈ స్కామ్ చేసే వ్యక్తి కూడా మరొకరి చేతిలో మోసం పోవడం. చాలామంది స్కామీ కంపెనీలనుంచి ఫేక్ ఉద్యోగ ఆఫర్లు పొంది విదేశాలకు వెళతారు. వారు అక్కడ బందీలుగా ఉండి నకిలీ ఫేక్ ఫ్రొఫైల్ లతో ఇతరులను నమ్మించి ఇలాగే డబ్బులను కొట్టేస్తారని నితిన్ కామత్ తెలిపారు. వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ఫేస్ బుక్ మొదలగు సోషల్ మీడియా యాప్ లలో ఎప్పుడూ తెలియని మెసేజ్ లకు రిప్లై ఇవ్వకూడదు.. కొత్త యాప్ లను డౌన్ లోడ్ చేసుకోమని లేదా లింక్ లను ఓపెన్ చేయాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మిమ్మల్ని రెడ్ జోన్ పడేయొచ్చు. ఈ స్కామ్ లలో నేరగాళ్ళు మీ ఫీలింగ్స్ ను క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తారు.. అస్సలు స్పందించకండి. ఏవైనా సందేహాలుంటే మీ సమీప పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయడం, లాయర్ల సలహాలు తీసుకోవడం గానీ చేయాలి. ఎవరైనా ఉద్యోగం లేదా తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అని హామీ ఇస్తే అది తప్పనిసరిగా స్కామ్ కు సంబంధించిన మేసేజ్ గానే గుర్తించాలి. ఆధార్ కార్డు, పాన్, పాస్ పోర్ట్ గురించి ఏదైనా వివరాలను అడిగితే అస్సలు చెప్పకూడదు. 

Post a Comment

0 Comments

Close Menu