Ad Code

వొడాఫోన్ ఐడియా కొత్త డేటా రీఛార్జ్ ప్లాన్ !


వొడాఫోన్ ఐడియా కొత్త రీచార్జ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఇది డేటా రీచార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ ధర రూ. 23 మాత్రమే. ఇందులో 1.2 జీబీ డేటా వస్తుంది. దీని వాలిడిటీ కేవలం ఒక్క రోజు మాత్రమే. అలాగే కంపెనీ రూ.19 ధరలో కూడా ఒక డేటా ప్లాన్ అందిస్తోంది. దీని ద్వారా ఒక జీబీ డేటా వస్తుంది. దీని వాలిడిటీ కూడా ఒక్క రోజు మాత్రమే. అంటే అదనంగా 200 ఎంబీ డేటా పొందాలని భావించే వారు రూ. 19 కాకుండా ఈ 23 డేటా ప్లాన్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ డేటా ప్లాన్ రాత్రి 12 గంటలకు ముగుస్తుంది. అంటే ఏదైనా ఉపయోగంచని డేటా ఉంటే మాత్రం అంతటితో పోతుంది. అందుకే డేటా పూర్తిగా ఉపయోగించుకోవాలి. అలాగే కంపెనీ యూజర్లకు రూ. 24 ధరలో కూడా ఒక డేటా ప్లాన్ అందిస్తోంది. దీని ద్వారా అన్‌లిమిటెడ్ డేటా బెనిఫిట్ పొందొచ్చు. అయితే దీని వాలిడిటీ మాత్రం కేవలం ఒక్క గంట మాత్రమే ఉంటుంది. అంటే గంటలో ఎంత డేటా వస్తే అంత డేటాను ఉపయోగించుకోవచ్చు. గంట అయిపోతే ప్లాన్ అయిపోతుంది. అలాగే ఇంకా ఎక్కువ డేటా కావాలని భావిస్తే.. అంటే 3,4 జీబీ డేటా కోసం ఇతర ప్లాన్స్ ఎంచుకోవడం ఉత్తమం. రూ. 49 ధరలో రీచార్జ్ చేసుకోవడం ఉత్తమం. ఈ ప్లాన్ కింద 6 జీబీ డేటా వస్తుంది. దీని వాటిడిటీ ఒక రోజు ఉంటుంది. అలాగే ఎయిర్ టెల్ కూడా ఇలాంటి డేటా ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్స్ అన్నీ కూడా వీఐ యాప్ లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 

Post a Comment

0 Comments

Close Menu