జపనీయులు సరికొత్త మైక్రో ఓవెన్‌ను తయారు చేశారు. దానిని చూస్తే మైక్రో ఓవెన్ అని అస్సలు అనుకోరు. ప్రస్తుతం అంతా పోర్టబుల్ స్టవ్, పోర్టబుల్ కుకర్ వంటివి వినియోగిస్తుంటాం. అయితే పోర్టబుల్ మైక్రో ఓవెన్ అనేది ఇప్పటి వరకు మనం విని ఉండం..సరికొత్త టెక్నాలజీ తో ఎంతో ముందుండే జపనీయులు ప్రస్తుతం దానిని కూడా సుసాధ్యం చేశారు. ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేలా సరికొత్త మైక్రో ఓవెన్‌ను రూపోందించారు.. అది చూడటానికి అచ్చం సూట్‌కేస్‌లా ఉండే దీనిని మనం అవసరమైన సందర్భంలో ఓపెన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఆహారాన్ని అందులో పెట్టుకుని వేడి చేసుకోవచ్చు. మన పని పూర్తైన తర్వాత తిరిగి సూట్ కేస్‌లా దానిని మడత పెట్టుకోవచ్చు… హ్యాండిల్ లాక్ ఓపెన్ చేసేందుకు దానిని వెనక్కి జరపాలి.. మన పని పూర్తైతే తిరిగి ఫోల్డ్ చేసేయొచ్చు. చూడడానికి ఎంతో బాగున్న ఈ మైక్రో ఓవెన్ ఇంకా మార్కెట్‌లోకి విడుదల కాలేదు.. జస్ట్ ట్రయిల్ మాత్రమే జరుగుతుంది.. ప్రస్తుతం కొన్ని టెస్టులు జరిపేందుకు సన్నాహాలు చేస్తుంది.. త్వరలోనే కొన్ని దేశాల మార్కెట్ లో విడుదల చెయ్యనుందని సమాచారం..
పోర్టబుల్ మైక్రో ఓవెన్ !
0
November 21, 2023
Tags