Ad Code

తెలుగులో చాట్ జీపీటీ టెక్స్ట్‌, వాయిస్‌ కమాండ్స్‌ !


ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఏఐ, లాంగ్వేజ్‌ మోడల్‌, జనరేటివ్‌ ప్రీ-ట్రైన్డ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఓ సంచలనం సృష్టిచింది. తమకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందించే ఓపెన్‌ఏఐ రూపకల్పన అయిన చాట్‌జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా క్రియాశీల కస్టమర్లు ఉన్నారు. అనాలిటిక్‌ భాషలతో పోలిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీపీటీలు భారతీయ లాంగ్వేజ్ సింథటిక్‌ లాంగ్వేజెస్ లో మాత్రం పెద్ద పురోగతిని సాధించలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఇండియాన్ లాంగ్వేజ్ ల్లోకి అడుగుపెడుతుంది. తెలుగులో జీపీటీ అసంపూర్తిగా ఉంది. ఇతర భారతీయ భాషలలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ వెలితిని పూడ్చేందుకు 'ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా' ముందుకు వచ్చింది. ఆ సంస్థ నుంచి ఆవిర్భవించిన స్వేచ్ఛ ఐటీ సంస్థ ఈ దిశగా తొలి అడుగు వేసింది. భారతీయ భాషలు ప్రధానంగా తెలుగులో ఉచితంగా చాట్‌జీపీటీ మాదిరి సేవలను అందించేందుకు రెడీ అయింది. దీంట్లో ఏకంగా 10 వేల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు. డేటాథాన్‌ పేరుతో నిన్న నిర్వహించిన సమావేశంలో 10 ఐటీ కంపెనీల ఉద్యోగులు, 25 ఇంజనీరింగ్‌ కాలేజీల స్టూడెంట్స్ హజరయ్యారు. మరో రెండు నెలల్లో చాట్‌జీపీటీ తరహాలో ఏఐ, జీపీటీల కలయికతో తెలుగు వెబ్‌సైట్‌, యాప్‌ రెడీ అవుతుందని, తెలుగు టెక్స్ట్‌, వాయిస్‌ కమాండ్స్‌ ఆధారంగా దీనిని ఎవరైనా ఈజీగా ఉపయోగించేలా డెవలప్ చేస్తున్నామని స్వేచ్ఛ ప్రతినిధులు పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu