ఓపెన్‌ఏఐ కంపెనీ రూపొందించిన చాట్‌బాట్ చాట్‌జీపీటీ రాకతో ట్రెండ్ మొదలైంది. అనంతరం టెక్ దిగ్గజం గూగుల్ తన సొంత చాట్‌బాట్ బార్డ్‌ను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ రెండింటికీ పోటీగా యూఎస్ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రానుంది. 'ఒలింపస్' అనే కోడ్‌నేమ్‌తో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ని అభివృద్ధి చేస్తోంది. ఒలింపస్ రెండు ట్రిలియన్ పారామీటర్స్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని డెవలప్‌మెంట్‌తో అతిపెద్ద AI మోడల్‌లలో ఒకటిగా నిలువనుంది. OpenAIకి చెందిన GPT-4 మోడళ్లు ఒక ట్రిలియన్ పారామీటర్స్‌ని మాత్రమే కలిగి ఉండటం గమనార్హం. ఈ కంపెనీలు మాత్రమే కాకుండా యాపిల్ వంటి సంస్థలు కూడా ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అమెజాన్‌లో అలెక్సా మాజీ హెడ్ రోహిత్ ప్రసాద్ ఒలింపస్ ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ఇప్పుడు నేరుగా కంపెనీ CEO ఆండీ జాస్సీకి రిపోర్ట్ చేస్తారు. ఈ ఇనిషియేటివ్ అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్, AWSని బలోపేతం చేయడం, ఎంటర్‌ప్రైజ్ కస్టమర్‌లకు మరింత ఆకర్షణీయంగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అమెజాన్ తన AI సామర్థ్యాలను మెరుగుపరచడానికి LLMలలో పెట్టుబడి పెడుతోంది, ప్రత్యేకించి భారీ డేటాసెట్‌లను ఉపయోగించి హ్యూమన్-లైక్ రెస్పాన్స్‌లను రూపొందించనుంది. అయినప్పటికీ, అటువంటి పెద్ద AI మోడళ్లను అభివృద్ధి చేయడం, శిక్షణ ఇవ్వడానికి గణనీయమైన కంప్యూటింగ్ పవర్ అవసరం. ఇందుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. LLMలలో పెట్టుబడి పెట్టడం ద్వారా, AI, క్లౌడ్ కంప్యూటింగ్ స్పేస్‌లో అమెజాన్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. జనరేటివ్ ఏఐలో ఇన్వెస్ట్‌మెంట్ పెంచడం, ఫుల్‌ఫిల్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్ వంటి రిలైట్ ఆపరేషన్స్‌లో ఖర్చులు తగ్గించే స్ట్రాటజీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అమెజాన్ యొక్క పోటీదారు, ఓపెన్‌ఏఐ మరో అడుగు ముందుకేసింది. తన ఏఐ చాట్‌బాట్‌కు కస్టమైజ్డ్ చాట్‌బాట్‌లను క్రియేట్ చేసే అవకాశాన్ని వినియోగదారులకు అందించే ప్రయత్నాల్లో ఉంది. స్పెసిఫిక్ పర్పస్ కోసం ఉపయోగించే అవకాశాన్ని అందించే యోచన చేస్తోంది. GPTలుగా పేర్కొనే ఈ కస్టమైజ్డ్ AI మోడళ్లు, నిర్దిష్ట పనులు లేదా రోజువారీ కార్యకలాపాల కోసం AIని మరింత సహాయకరంగా చేయనున్నాయి. వారి క్రియేషన్‌ని ఇతరులతో షేర్ చేసుకునేందుకు వినియోగదారులకు కొత్త మార్గాన్ని అందిస్తాయి. ఈ విధానం వివిధ డొమైన్‌లకు అడాప్ట్ చేసుకునే పర్సనలైజ్డ్, టాస్క్-స్పెసిఫిక్ AI మోడళ్లకు పెరుగుతున్న ట్రెండ్‌ను సూచిస్తుంది.
చాట్‌జీపీటీకి పోటీగా ఒలింపస్ ?
0
November 08, 2023
Tags