Ad Code

మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1పై డిస్కౌంట్ !


పిల్‌ అధికారిక వెబ్‌ సైట్‌లో మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ధర రూ.99,900 కు లభిస్తుంది. HDFC బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.8000 తగ్గింపును పొందవచ్చు. అంటే ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ.91,900కే లభిస్తుంది. ఈ ల్యాప్‌ను అమెజాన్‌లో మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ల్యాప్‌టాప్‌ స్పేస్‌ గ్రే రంగులో అమెజాన్‌ ఇండియాలో రూ.79,999కి అందుబాటులో ఉంది. గోల్డ్‌, సిల్వర్‌ కలర్‌ ల్యాప్‌టాప్‌ల ధర రూ.84,990 గా ఉంది. హెడ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా రూ.5000 తగ్గింపును పొందవచ్చు. ఆపిల్‌ నుంచి అందుబాటులోకి వచ్చిన శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లలో మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ఒకటిగా ఉంది. ఈ ల్యాప్‌ ఆపిల్‌ సొంత చిప్‌ M1 పైన పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న శక్తివంతమైన ప్రాసెసర్‌లలో ఈ చిప్‌ ఒకటిగా ఉంది. ఈ చిప్‌ ద్వారా వీడియో ఎడిటింగ్‌, ఫోటో ఎడిటింగ్‌ వంటి టాస్క్‌లు కూడా సులభంగా చేసుకోవచ్చు. ఆపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1.. మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. సంస్థ అధికారిక లెక్కల ప్రకారం ఈ ల్యాప్‌టాప్‌ 18 గంటల బ్యాటరీ లైఫ్‌ ఇస్తుంది. విద్యార్థులు, వివిధ రంగాల నిపుణులకు ఈ ల్యాప్‌టాప్‌ మెరుగైన అనుభవాన్ని ఇస్తుంది. మ్యాక్‌బుక్‌ ఎయిర్ M1 ల్యాప్‌టాప్‌ తక్కువ బరువును కలిగి ఉంటుంది. సుమారు 1.29kg మరియు 16.1mm థిక్‌నెస్‌తో వస్తుంది. ఎక్కడకైనా తీసుకెళ్లేందుకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ ల్యాప్‌ 13.3 అంగుళాల రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 2560*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. IPS టెక్నాలజీతో LED బ్యాక్‌లిట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ట్రూ టోన్‌ టెక్నాలజీ సహా 400 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మరియు 30W USB-C పవర్‌ అడాప్టర్‌తో వస్తుంది. మరియు 49.9 వాట్‌హవర్‌ లిథియం పాలిమర్‌ ఇన్‌బిల్ట్‌ బ్యాటరీతో వస్తుంది. సినిమాలు చూసేందుకు, యూట్యూబ్‌ వినియోగం, ఫొటో, వీడియో ఎడిటింగ్ సహా మరెన్నో టాస్క్‌లు చేసేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, నిపుణులు సహా ఇతరులకు ఎంతో అనువుగా ఉంటుంది. ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ సహా మెరుగైన డిస్‌ప్లే, డిజైన్‌, బిల్డ్ క్వాలిటీ ఈ ల్యాప్‌ ప్రత్యేకతలు.


Post a Comment

0 Comments

Close Menu